అన్వేషించండి
Upcoming Telugu Movies: హిస్టారికల్ డ్రామా నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ వరకూ.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సినిమాల పండుగే, చూసి ఎంజాయ్ చెయ్యండి!
Upcoming Telugu Movies: మార్చి మొదటి వారంలో దాదాపు 10కి పైగా సినిమాలు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు, ఓటీటీలోనూ పలు మూవీస్, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

మార్చి మొదటి వారంలో రిలీజ్ కానున్న సినిమాలు
Source : Twitter (X)
Latest Telugu Movies Theater And OTT Releases: వేసవి ముందు అటు థియేటర్లు ఇటు ఓటీటీల్లో వినోదాల విందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మార్చి మొదటి వారంలో ఏకంగా 10కి పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో డబ్బింగ్ మూవీస్‌తో పాటు చిన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే, ఓటీటీలోనూ పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ నుంచి హారర్, క్రైమ్, లవ్, మెసేజెస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకూ ఎంటర్‌టైన్ చేయనున్నాయి. ఆ జాబితా ఓసారి చూస్తే
- హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా' - ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా'. విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ హిందీలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తాజాగా తెలుగులోనూ మార్చి 7న విడుదల కానుంది.
- జిగేల్ - త్రిగుణ్, మేఘాచౌదరి లీడ్ రోల్స్‌లో నటించిన కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' (Jigel) సైతం మార్చి 7నే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి మల్లి యేలూరి దర్శకత్వం వహించగా.. డాక్టర్ వై.జగన్మోహన్, అల్లం నాగార్జున నిర్మిస్తున్నారు.
- నారి - మహిళా సాధికారత, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి..?, వారికి ఎలా అండగా నిలవాలి.. వంటివి ప్రధానాంశాలుగా తెరకెక్కిన సినిమా 'నారి' (Naari). ప్రముఖ సీనియర్ నటి ఆమని, వికాస్, వశిష్ట, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సూర్య వంటిపల్లి రూపొందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 7న ఈ సినిమాను థియేటర్లలోకి రానుంది.
- కింగ్ స్టన్ - జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కింగ్ స్టన్'. సముద్ర తీర గ్రామం ఇతివృత్తంగా ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ను కమల్ ప్రకాశ్ రూపొందించగా.. ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది.
- ఆఫీసర్ ఆన్ డ్యూటీ - టాప్ హీరోయిన్ ప్రియమణి, కున్‌చకో బొబన్ లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ హిట్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సైతం ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. జీతూ ఆష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగదీశ్, విశాఖ్ నాయర్ కీలకపాత్రలు పోషించారు.
- రాక్షస - టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్‌తో కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాక్షస'. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న కన్నడతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
- రారాజా - హీరో హీరోయిన్లు ముఖాలు చూపించకుండా కేవలం కథ ఆధారంగా ప్రయోగాత్మకంగా రూపొందించిన చిత్ర 'రా రాజా'. బి.శివప్రసాద్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- పౌరుషం - సుమన్ తల్వార్ లీడ్ రోల్‌లో నటించిన 'పౌరుషం' మూవీ ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
- W/O అనిర్వేష్ - జబర్దస్త్ ఫేం, ప్రముఖ కమెడియన్ రాంప్రసాద్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' ఈ నెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని గంగా సప్తశిఖర తెరకెక్కించగా.. జెమినీ సురేష్, సాయిప్రసన్న, కిరీటీ దామరాజు కీలకపాత్రలు పోషించారు.
- శివంగి - నటి ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ శివంగి. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది.
- నీరుకుళ్ల - ఆర్కే మాస్టర్, రిద్ది ఒబెరాయ్ నటించిన 'నీరుకుళ్ల 35 KM' మూవీ ఈ నెల 7న రిలీజ్ కానుంది. రమేశ్ ప్లాసి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. చంద్రతేజ్, మధు టిల్లు కీలక పాత్రలు పోషించారు.
- 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో - అంకిత్ కొయ్య, శ్రియ కొణతం, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన లవ్ ఎంటర్‌టైనర్ '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' ఈ నెల 7న రిలీజ్ కానుంది.
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - టాప్ హీరోస్ వెంకటేశ్, మహేశ్ బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న మళ్లీ థియేటర్లలోకి రానుంది.
ఓటీటీలోకి వచ్చే సినిమాలివే..
- నెట్ ఫ్లిక్స్ - పట్టుదల (తెలుగు - మార్చి 3), విత్ లవ్ మేఘన్ (వెబ్ సిరీస్ - మార్చి 4), తండేల్ (మార్చి 7), నదానియాన్ (హిందీ - మార్చి 4).
- ఈటీవీ విన్ - ధూం ధాం (తెలుగు - మార్చి 6)
- అమెజాన్ ప్రైమ్ వీడియో - దుపహియా (హిందీ - మార్చి 8)
- జియో హాట్ స్టార్ - డేర్ డెవిల్ (వెబ్ సిరీస్ - మార్చి 4), బాపు (తెలుగు - మార్చి 4)
- సోనీ లివ్ - రేఖాచిత్రం (తెలుగు - మార్చి 7), ది వేకింగ్ ఆఫ్ నేషన్ (హిందీ సిరీస్ - మార్చి 7)
- జీ5 - కుటుంబస్థాన్ (తమిళ/తెలుగు - మార్చి 7)
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్






















