AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Andhra Pradesh News | చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

జీడీ నెల్లూరు: ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జీడీ నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ లబ్ధిదారు మహిళ ఇంట్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఒక్కొక్కరి పేరిట రూ.2 లక్షలు ఎఫ్‌డీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో ప్రజావేదిక ద్వారా సమావేశమై సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఏపీ ప్రజల్లో భయం పోయింది
'అయిదేళ్ల తరువాత ఏపీలో భయం పోయి, ఎటు చూసినా నవ్వులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎంతో స్వేచ్ఛగా కనిపిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. గత ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. 64 లక్షల మంది పింఛన్లు అందిస్తున్నాం. రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2000 చేయగా.. ప్రజల్ని ఏడిపించి ఏడిపించి రూ.3000 ఫించన్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రజల మీద ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో మేం ఇచ్చిన హామీ మేరకు రూ.4000కు పింఛన్ పెంచాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా అందించాం. దివ్యాంగులకు రూ.500 నుంచి పింఛన్లు ఇప్పుడు రూ.6000 కు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించాం. 8 లక్షల మందికి నెలకు రూ.6 వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం' అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలు
కిడ్నీ పేషెంట్లు, తలసేమియా బాధితుల పరిస్థితి దారుణం. నెలకోసారి రక్తం మార్పిడి. వారికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆందుకుంటున్నాం. బెడ్ కు పరిమితమైన వారికి సైతం ఒకేసారి రూ.15 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. 2014లో రెండు వందల పింఛన్ నుంచి ఇప్పుడు పదిహేను వేలకు తీసుకెళ్లాం. ఏడాదికి 33వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు అందిస్తున్నాం. ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులు వదిలిపెట్టిపోతే అమ్మమ్మ బాధ్యత తీసుకోవడాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఆవిడ విలువలకు మారు పేరు అని కొనియాడారు. వారికి జాగా ఇచ్చి, ఏడాదిలోగా ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ ఆవును ఇచ్చి నెలకు రూ.15 వేల ఆదాయం వచ్చేలా చేస్తాం. ఇద్దరికీ నెలకు రూ.4 వేల చొప్పున ఆరు నెలలు ఇస్తాం. వారి పేరిట ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌డీ వేస్తాం. ఆ కుటుంబ పెద్ద కొడుకుగా వారి సమస్యలు తీర్చుతా. నేతలు, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదోనని టెక్నాలజీ ద్వారా పరిశీలిస్తున్నా. ఉదయం 7 గంటల నుంచి 10, 11 గంటల వరకే 80 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశాం.
చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి తినిపోతే పర్లేదు. కానీ మొత్తం తినేసి, అంతా నాశనం చేసి పోతాయి. గత వైసీపీ పాలకులు ఇదే తీరుగా ప్రవర్తించారు. ప్రజలు ఎంతో తెలివిగా ఆలోచించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 93 శాతం విజయాన్ని అందించారు. 30 ఏళ్ల కింద నేను సెల్ ఫోన్ వాడితే వింతగా చూశారు, ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ ద్వారా సెల్ఫీలు తీసుకోవడం కాదు, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి సర్టిఫికెట్లు అందిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఏపీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. కేంద్రంను ఒప్పించి ఏపీ అభివృద్ధికి నిధులు తెస్తామన్నారు చంద్రబాబు.
Also Read: ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

