Qualities Women Love in Men : అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేవి ఇవే.. ఇలా ఉంటే నచ్చేస్తారట
Qualities Women Find Attractive : మై డియర్ అబ్బాయిలు.. మీరు ప్రేమించే అమ్మాయికి మీరు నచ్చాలి అనుకుంటున్నారా? అయితే మీలో ఈ అంశాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

Women Love in Men : అమ్మాయిలకు అబ్బాయిలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ అబ్బాయిల్లో కొన్ని అంశాలు అమ్మాయిలకు మంచి ఇంప్రేషన్ని ఇస్తాయట. ఆ అంశాలు మీలో ఉంటే మీతో గర్ల్స్‌కి మంచి కనెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అందరికీ ఇవే నచ్చాలని రూల్ లేదు. కానీ ఎక్కువశాతం మంది అమ్మాయిలు అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే చాలా నచ్చుతారని చెప్తున్నారు. ఇంతకీ ఆ అంశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమనుకుంటారు కానీ.. కరెక్ట్‌గా ట్రై చేస్తే గర్ల్స్‌ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. వారితో మీరు మంచి బాండింగ్ ఏర్పరుచుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా ఈ అంశాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు అందరూ అమ్మాయిలు.. తమకు నచ్చినవారిలో ఈ క్వాలిటీలు చెక్ చేస్తారట.
రెస్పెక్ట్
స్త్రీలకు రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయిలు అమ్మాయిలకు బాగా నచ్చుతారట. మహిళలకు గౌరవాన్ని ఇస్తూ.. ప్రేమను అందిస్తూ.. కెరీర్లో ముందుకు వెళ్లడాన్ని ప్రోత్సాహిస్తూ.. తల్లి, సిస్టర్స్‌తో మంచి బాండింగ్ ఉండేవారిపై మంచి ఇంప్రెషన్ ఉంటుందట. అలాంటివారు భార్యను కూడా వీరు మంచిగా చూస్తారని భావిస్తారట.
వినాలి..
ఏదైనా చెప్తుంటే.. నువ్వు చెప్పేది తప్పు అని మధ్యలో జడ్జ్ చేయకుండా.. ముందుగా అమ్మాయి ఏమి చెప్తుందో వినేవారు బాగా నచ్చుతారట. ఇది మీరు అవతలి వారి ఆలోచనలకు ఇచ్చే రెస్పెక్ట్‌గా కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు గుడ్ లిజనర్గా ఉంటే.. చాలా మంచిది.
కామెడీ టైమింగ్..
హాస్యం అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టెన్షన్స్‌తో కూడుకున్న ఈ జీవితంలో ఫన్ని క్రియేట్ చేసే అబ్బాయిలు అమ్మాయిలకు బాగా నచ్చుతారట. ఇది బాండింగ్‌ని పెంచడంతో పాటు.. సంబంధాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందట.
క్షమించే గుణం..
చిన్న తప్పులకు కూడా కొందరు అబ్బాయిలు అమ్మాయిలను ఏమి చేతికాదంటూ.. లేదా నీవల్లే ఇది జరిగిందంటూ నిందిస్తారు. అలా కాకుండా ఆమె లోపాలను యాక్సెప్ట్ చేస్తూ క్షమించే గుణం కలిగి ఉండాలని కోరుకుంటారు. తన నిజమైన వ్యక్తిత్వాన్ని గుర్తించే వ్యక్తిని అమ్మాయిలు కోరుకుంటారట. ఈ లక్షణం ఉండే అబ్బాయిలతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారట.
నిజాయితీ..
ఏ రిలేషన్లో అయినా నిజాయితీ చాలా ఇంపార్టెంట్. అబ్బాయిల నుంచి కూడా అమ్మాయిలు ఈ నిజాయితీనే కోరుకుంటారట. మీ ఆలోచనలు, అనుభవాలు నిజాయితీగా చెప్పేవారంటే అమ్మాయిలకు ఇష్టమట. తమని మోసం చేయరనే భావన అమ్మాయిల్లో గుడ్ ఇమేజ్ ఇస్తుందట.
కుంటుబం..
ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చే అబ్బాయిలు ఎక్కువ రెస్పాన్స్బులిటీతో ఉంటారని.. అలాంటివారితో ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం మంచిదని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. కుటుంబంతో మంచి బాండింగ్ లేకుంటే.. తమతో కూడా రిలేషన్ బాగుండదని ఫీల్ అవుతారట. తల్లికి ఇంటిపనుల్లో హెల్ప్ చేయడం, నాన్నకు చేదోడువాదోడుగా ఉండడం గుడ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తుందట.
ఆర్థికంగా..
కేవలం ప్రేమతో లైఫ్‌ని లీడ్ చేయలేరు. కాబట్టి.. ఆర్థికంగా కూడా అబ్బాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటారట. ఆస్తులు లేకపోయినా కష్టపడేతత్వం ఉండే వారంటే అమ్మాయిలకు మంచి రెస్పెక్ట్ ఉంటుందట. రెస్పాన్స్‌బుల్‌గా ఉండే అబ్బాయిలు అమ్మాయిలకు బాగా నచ్చుతారట. అంతేకాకుండా ఈ క్వాలిటీ ఉన్న అబ్బాయిలు బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తారట.
తెలివి ఉంటే..
తెలివితేటలు, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే తత్వం, క్రియేటివిటీ ఉంటే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారట. వారితో మాట్లాడేందుకు ఉత్సాహాం చూపిస్తారట.
ఈ లక్షణాలు ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారట. మరి అబ్బాయిలు మీలో ఈ క్వాలిటీలు ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోండి మరి. లేకుంటే మీకు నచ్చిన అమ్మాయికోసం ఈ అంశాలను అలవరచుకోండి. ఇవి కేవలం అమ్మాయి కోసమే కాదు.. జీవితంలో సక్సెస్ అయ్యేందుకు కూడా ఫాలో అవ్వొచ్చు.
Also Read : మీకంటే వయసు చాలా ఎక్కువ ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే .. లాభాలేంటి? నష్టాలేంటి? రిలేషన్ సక్సెస్ అవుతుందా?






















