Womens Day 2025 Gift Ideas : మహిళ దినోత్సవం సందర్భంగా ఈ బహుమతులు ఇచ్చేయండి.. బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్ ఇవే, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా
Women's Day 2025 : ఉమెన్స్ డే సందర్భంగా మీ లైఫ్‌లో ఉన్న మహిళలకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈసారి వీటిని బహుమతిగా ఇచ్చి విషెష్ చెప్పేయండి.

International Womens Day 2025 : అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మీరు ఎవరికైనా బహుమితి ఇవ్వాలనుకుంటున్నారా? గిఫ్ట్ ఇచ్చేందుకు చాలానే అందుబాటులో ఉంటాయి. కానీ అవసరమైనవి, ఉపయోగపడేవాటిని ఇస్తే మహిళలు చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఏమి అవసరమున్నాయో ముందు తెలుసుకోండి. అవి మీరు ఎఫర్ట్ చేయగలము అనుకుంటే వాటిని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. లేదంటే.. ఎలాంటి వస్తువులు గిఫ్ట్‌గా ఇస్తే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
మీ జీవితంలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలకు మరింత ఉత్సాహాన్ని, చేయూతని అందిస్తూ.. వారు చేస్తున్న కృషిని, కష్టాన్ని గుర్తించి ప్రశంసిస్తూ.. ఉమెన్స్ డే రోజు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మీరు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసి గిఫ్ట్ చేయొచ్చు. అయితే ఎలాంటి గిఫ్ట్ అయితే అవసరానికి ఉపయోగపడతాయో.. ఎలాంటివి ఇస్తే బెస్టో ఇప్పుడు చూసేద్దాం.
జ్యూవెలరీ..
మీ ఇంట్లోని అమ్మకు, సిస్టర్‌కి, ఫ్రెండ్‌కి లేదా వైఫ్‌కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వారికి జ్యూవెలరీ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. అంత బడ్జెట్ లేదు అనుకుంటున్నారేమో.. మీరు గిఫ్ట్‌గా గోల్డ్ ఇవ్వాల్సిన పని లేదు. మీ స్థాయి, మీ స్థోమతకు తగ్గట్లు గోల్డ్, సిల్వర్, బ్లాక్ మెటల్ ఇలా ఏదైనా ఇవ్వొచ్చు. జ్యూవెలరీ విషయంలో మీరు పెట్టే కాస్ట్ కంటే.. మీరు పెట్టే ఎఫర్ట్స్ కనిపించేలా మంచి వస్తువుని సెలక్ట్ చేసుకోండి. ఆఖరుకి మీరు మట్టిగాజులు ఇవ్వాలనుకున్నా.. దానికి కాస్త ఓపిక తెచ్చుకుని.. వెతికి వారికి నప్పుతాయో లేదో ఆలోచించి.. ఓ బ్యూటీఫుల్ నోట్‌తో వాటిని గిఫ్ట్ చేయొచ్చు.
హ్యాండ్ బ్యాగ్
దాదాపు ప్రతి మహిళ బయటకు వెళ్లేప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్తారు. వర్క్ పరంగానే కాకుండా పర్సనల్ షాపింగ్‌కి వెళ్లేప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఓ మంచి హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకోండి. ఇక్కడ కూడా కాస్ట్ తక్కువైనా.. ఎక్కువకాలం మన్నికగా ఉండే వాటిని, లుక్ బాగుండే వాటిని గిఫ్ట్‌గా చేసి ఇవ్వొచ్చు. కుదిరితే దానిని మరింత అట్రాక్టివ్‌గా మార్చేందుకు పేరుతో కూడిన లేబుల్ లేదా కీచైన్‌ని జత చేయవచ్చు.
వాచ్
వాచ్ కామన్ గిఫ్ట్ అయినా.. మీరు ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఓ మంచి నోట్‌తో దానిని గిఫ్ట్‌గా ఇవ్వండి. చాలామంది మహిళలలు పనుల్లో పడి ఫుడ్‌కి, తమ గురించి సెల్ఫ్‌కేర్ తీసుకోవడానికి సమయం కేటాయించరు. అలాంటివారికోసం టైమ్‌కి తిని, టైమ్‌కి నిద్రపోవాలని.. కాసేపు సమయాన్ని నీకోసం కేటాయించుకోవాలని కోరుకుంటూ ఈ గిఫ్ట్ ఇస్తున్నానంటూ నోట్ రాయొచ్చు. ఇలా ఇవ్వడం వల్ల ఆ వాచ్ చూసినప్పుడు కచ్చితంగా మీరు రాసిన మాటలు వారికి గుర్తొసస్తాయి.
స్కిన్ కేర్ కిట్
అమ్మాయిలకు మేకప్ కిట్ కంటే స్కిన్ కేర్ కిట్‌ని ఉమెన్స్ డేకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఎందుకంటే మేకప్‌లో ఎలాంటి షేడ్స్ ఎంచుకోవాలో.. మీకు అంతగా తెలీకపోవచ్చు. అదే స్కిన్ కేర్ అయితే చాలావరకు అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి స్కిన్ కేర్ కిట్‌ని వారికి గిఫ్ట్‌గా ఇచ్చి ఉమెన్స్ డే విషెష్ చెప్పండి.
మరిన్ని గిఫ్ట్ ఐడియాలు..
జర్నల్, స్పా కిట్, అరోమా థెరపీ కిట్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, పెప్పర్ స్ప్రే, మూవీ టికెట్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వొచ్చు. అమ్మలకు అయితే చీరలు లేదా ఇంట్లో ఆమెకు పనిని తగ్గించే వస్తువులు ఏదైనా గిఫ్ట్‌గా ఇస్తే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. వారు హెల్తీగా ఉండాలని గుర్తు చేస్తూ జిమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇలా ఏది చేసినా.. వారి హెల్త్, వెల్త్‌కి హెల్ప్ అయ్యేది ఇస్తే మంచిది. మరి ఈసారి మీ జీవితంలోని మహిళకు మీరేమి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి.
Also Read : అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేవి ఇవే.. ఇలా ఉంటే నచ్చేస్తారట






















