Crime News: తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
Suiside: నమ్మించాడు. సహజీవనం చేశాడు. మోజు తీరాక వేరే పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో సర్వం కోల్పోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Women Suiside: ఖమ్మం జిల్లా పొన్నెకల్లులో కావ్యా కల్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. సినీ రంగంలో డాన్సర్ గా గుర్తింపు పొందేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. ఢీ వంటి డాన్స్ షోలలో ప్రతిభ చూపేవారు. మంచి భవిష్యత్ ఉందని ఊళ్లో వాళ్లంతా అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ప్రాణాలు తీసుకున్నారు. దాంతో కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.
అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుందో వారికి అర్థం కాలేదు. హైదరాబాద్ లో ఎన్ని కష్టాలు పడుతుందో ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమి వచ్చిందో తెలుసుకోవాలని ఆమె ఫోన్ ను ఓపెన్ చేసి చూశారు కుటుంబసభ్యులు. అందులో ఉన్న వీడియో చూసి అసలు కారణం తెలుసుకున్నారు. తీసుకెళ్లి వీడియోను పోలీసులకు ఇచ్చి కేసు పెట్టారు.
కావ్యా కల్యాణి డాన్సర్ గా ఉంటూ ఢీ షోలో పాల్గంటున్న సమయంలో అక్కడే మేల్ డాన్సర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభి అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొద్ది రోజులగా దగ్గర అయ్యాడు.కలసి ఉందామని సహజీవనం కూడా ప్రారంభించాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఐదేళ్ల పాటు బాగానే ఉన్నా.. ఇటీవలి కాలంలో అభి మరో అమ్మాయి మోజులో పడ్డాడు. కావ్యా కల్యాణిని పట్టించుకోవడం మానేశాడు. ఇంటికి కూడా రావడం లేదు. అభితో సహజీవనం చేస్తూ.. అభి కెరీర్ కోసం సాయం చేస్తూ.. తన డాన్స్ కెరీర్ ను కూడా కావ్యా కల్యాణి నిర్లక్ష్యం చేశారు.
👉 ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ..
— Mahaa Patrika (@MahaaPatrika) March 1, 2025
సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
👉 ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
👉 నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ#Mahaapatrika #suside #khammam #dheeshow pic.twitter.com/v9Y3iIhkOI
అటు కెరీర్ లో వెనుకబడిపోవడంతో పాటు ఇప్పుడు అభి కూడా మోసం చేయడంతో కావ్యా కల్యాణి తట్టుకోలేకపోయారు.తనకు జరిగిన అవమానం.. అభిచేసిన మోసం గురించి వీడియో తీసుకున్నారు. ఉరి వేసుకోవడానికి రెడీ అయిన తర్వాత ఆ వీడియో తీశారు. చాలా ఆవేదనతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ వీడియోరికార్డు చేసుకుని తర్వాత ఆత్మహత్య చేసుకున్నార.
ఈ వీడియో ఇప్పుడు పోలీసుల వద్దకు చేరడంతో ఢీ షో డాన్సర్ అభిని పోలీసులు అరెస్టు చేశారు. తాము సహజీవనం చేసిన మాట నిజమేనని అభి అంగీకరించిట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రేమ పేరుతో మోసం చేసి.. సహజీవనం చేసి వదిలేసే ఇలాంటి వ్యక్తుల వల్ల ఎంతో మంది జీవితాలు దుర్భరం అవుతున్నాయి.
అయితే ఆత్మహత్య అనేది ఏ సమస్యకూ పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆలోచనలు వస్తే వెంటనే.. సంబంధింత నిపుణుల్ని .. మానసిక వైద్యుల్ని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలని సలహాలిస్తున్నారు.
Also Read: భర్త హత్యకు సుపారీ, భార్య ప్రియుడి దాడిలో గాయపడిన డాక్టర్ మృతి - వరంగల్‌లో విషాదం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

