అన్వేషించండి

Crime News: భర్త హత్యకు సుపారీ, భార్య ప్రియుడి దాడిలో గాయపడిన డాక్టర్ మృతి - వరంగల్‌లో విషాదం

Telangana Crime News | భర్త హత్యకు భార్య సుపారీ ఇచ్చింది. భార్య ప్రియుడి దాడిలో గాయపడిన వరంగల్ డాక్టర్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.

Warangal Crime News | వరంగల్: వరంగల్ జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ హత్యాయత్నం కేసు విషాదాంతమైంది. లవర్‌తో కలిసి డాక్టర్ భార్య సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది. ఆమె ప్రియుడు, అతడి ఫ్రెండ్ కలిసి చేసిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. 

పోలీసుల కథనం ప్రకారం..
వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి 2016లో ఫ్లోరా మరియాను వివాహం చేసుకున్నారు. కాగా, వీరిది లవ్ మ్యారేజ్. 2018లో డాక్టర్ సుమంత్ రెడ్డి తన భార్యతో పాటు బంధువుల విద్యాసంస్థలు చూసుకునేందుకు సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. సుమంత్ రెడ్డి ఓ పీహెచ్సిలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్‌గా చేరగా, ఫ్లోరా టీచర్ జాబ్ చేసింది. ఈ క్రమంలో సంగారెడ్డిలో జిమ్ కు వెళ్తున్న ఫ్లోరాకు అక్కడ ట్రైనర్ శామ్యూల్‌తో పరిచయం ఏర్పడింది. అ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో గొడవలు మొదలై తిరిగి వరంగల్ కు వెళ్ళిపోయారు. 
ఈ క్రమంలో 2019లో సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ గా ఫ్లోరాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత పెంబర్తిలోని కాలేజీని రంగసాయిపేటకు మార్చారు. మరోవైపు భర్త ఎన్ని సార్లు చెప్పినా ఫ్లోరా మరియా ప్రవర్తనలో మార్పు రాలేదు. తాను లేని సమయం చూసి లవర్ శామ్యూల్‌కు ఇంటికి పిలిపించుకుంటున్న విషయం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో దంపతుల మధ్య వివాదం మరింత ముదిరింది. తమ రిలేషన్ కు అడ్డుగా ఉన్నా భర్త సుమంత్ రెడ్డిని తొలగించుకోవాలని లవర్ శామ్యూల్‌తో కలిసి హత్యకు ఫ్లోరా ప్లాన్ చేసింది. ఇందుకోసం లక్ష రూపాయలు సుపారీ ఇచ్చింది. అందులో 50 వేలను సైబరాబాద్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా చేస్తున్న తన ఫ్రెండ్‌ రాజ్ కుమార్ కు జిమ్ ట్రైనర్ శామ్యూల్ ఇచ్చాడు. డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసి.. తమకు అతడి అడ్డు తొలగిస్తే ఇల్లు కూడా కట్టించి చేస్తానని శ్యాముల్ ఒప్పందం చేసుకున్నాడు.

హాస్పిటల్ నుంచి వస్తుంటే దాడి..
ఫిబ్రవరి 20 తేదీన కాజీపేట ఆసుపత్రి నుంచి డ్యూటీ ముగించుకుని వస్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డిని అడ్డుకున్నారు. మొదట సుత్తితో కారును బలంగా కొట్టారు అది గమనించి సుమంత్ ఆగి, కారు దిగాడు. తమ వెంట తెచ్చుకున్న సుత్తితో సుమంత్ రెడ్డి పై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడు చనిపోయాడనుకుని శామ్యూల్, అతడి ఫ్రెండ్ రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు డాక్టర్ ను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కానీ సుమంత్ రెడ్డి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తిరిగి వరంగల్ కు తీసుకువచ్చారు. 

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం డాక్టర్ సుమంత్ రెడ్డి చనిపోయాడు. కుమారుడిపై హత్యాయత్నంపై డాక్టర్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు రాజకుమార్, శామ్యూల్ తోపాటు హత్యకు ప్లాన్ చేసిన డాక్టర్ భార్య ఫ్లోరాను గురువారం నాడు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగానే డాక్టర్ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget