అన్వేషించండి

Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

Teenmar Mallanna Latest News | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. షోకాజ్ నోటీసులకు స్పందించలేదని పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది.

Congress party suspends Teenmar Mallanna | హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షాకోజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను వివరణ కోరింది. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, దాదాపు నెల కావస్తున్న షోకాజ్ నోటీసులకు బదులివ్వలేదు. మరోవైపు ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై, పార్టీలో ముఖ్య నేతలపై విమర్శల దాడిని పెంచడంతో షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ రియాక్షన్..

పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణన (Caste Census) సర్వే ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. పార్టీ లైన్  దాటితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, మల్లన్న చేసిన వాఖ్యలు తప్పు అన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, సొంత అభిప్రాయాలను పార్టీపై రుద్దితే ఫలితం అనుభవించక తప్పదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయ పడుతుంటే తీన్మార్ మల్లన్న విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

Also Read: Land Regularisation Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌‌ దరఖాస్తులపై కీలక అప్‌డేట్, ఆఫీసుల నుంచి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
Mulugu District Latest News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget