అన్వేషించండి

Land Regularisation Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌‌ దరఖాస్తులపై కీలక అప్‌డేట్, ఆఫీసుల నుంచి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్

Layout Regularisation Scheme In Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌‌ దరఖాస్తులకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సంబంధిత జోనల్ ఆఫీసుల నుంచి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ వస్తాయని తెలిపారు.

హైదరాబాద్‌: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS Scheme)కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 25 శాతం రాయితీ సైతం కల్పిస్తూ దరఖాస్తులకు ఆహ్వానించింది. ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని జీహెచ్ఎంసీ జోనల్‌ ఆఫీసులలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సాయం చేస్తోంది. 

జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల నుంచి ఫోన్ కాల్స్

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. అన్నీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు అధికారులు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. మీ LRS దరఖాస్తును ఆమోదిస్తున్నాం, ఆఫీసుకు వచ్చి రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారు. మార్చి 31లోపు అనుమతి లేని లేఅవుట్ల ప్లాట్లు క్రమబద్ధీకరణ కోసం నగదు చెల్లించే వారికి తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించింది. దాంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి దరఖాస్తుదారులకు కోసం హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. సంబంధిత జోనల్‌ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ హెల్ప్‌ డెస్కులను సంప్రదించాలని ఇలంబర్తి తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తొలిసారి ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి, అవి వేర్వేరు దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. అర్హమైన దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రయోజనం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై 25 శాతం రాయితీ

అక్రమ లేఅవుట్లపై తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. మార్చి 31 లోపు క్రమబద్దీకకరణ చేసుకున్న వాళ్లకు 25 శాతం రాయితీ సైతం ప్రకటించింది. నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించారు. అనుమతి లేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని గత నాలుగైదు ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.


సిటీలో జోన్ల వారీగా దరఖాస్తులు
చార్మినార్ - 15,292
ఎల్బీనగర్ - 40,383
ఖైరతాబాద్ - 5,773
కూకట్ పల్లి - 22,901
శేరిలింగంపల్లి - 18,721
సికింద్రాబాద్ - 4,795
మొత్తం - 1,07,865

ఎల్ఆర్ఎస్ మొత్తం దరఖాస్తుల వివరాలిలా..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 31, 2020 నుంచి అక్టోబర్ 31, 2020 వరకు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను    సీకరించింది. ఎల్‌ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నాలుగన్నరేళ్లు గడిచినా ఈ దరఖాస్తులు పరిష్కారం కాలేదు. మొత్తం 25.70 లక్షల LRS దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలో 3.58 లక్షలు రాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 1.07 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి నుంచి 1.35 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని గత ఏడాది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Also Read: Meenakshi Natarajan: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ - కాంగ్రెస్ క్యాడర్‌కు నినాదమిచ్చిన మీనాక్షి నటరాజన్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Embed widget