Saree Styling Tips :చబ్బీగా, కాస్త లావుగా ఉండేవారు ఈ తరహా శారీలు కట్టుకుంటే బెస్ట్.. ఎలిగెంట్ లుక్‌కోసం వీటిని ఫోలో అయిపోండి
Saree Styling for Plus Size Women : కాస్త లావుగా ఉండేవారు ఏ తరహా డ్రెస్ వేసుకోవాలన్నా కాస్త ఇబ్బంది పడతారు. వాటిలో చీరలు కూడా ఒకటి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే చీరల్లో కూడా అందంగా కనిపించొచ్చు.

Plus-Size Saree Guide : బొద్దుగా ఉండేవారు ముద్దుగా ఉంటారని అంటారు. కానీ బొద్దుగా, కాస్త లావుగా ఉండేవారికి ఎంతో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందుకే నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా.. కొనుక్కోవాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివాటిలో చీరలు కూడా ఒకటి. అవి కట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తామని ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. అలాంటివారిలో మీరు కూడా ఒకరా? అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో అయితే చీరల్లో కూడా ఎలిగెంట్‌గా కనిపించవచ్చు.
ట్రెడీషనల్ లుక్ అంటే ముందుగా గుర్తొచ్చేది చీరలే. వీటిని చాలామంది ఇష్టపడతారు. అందంగా కూడా కనిపిస్తారు. చబ్బీగా, ప్లస్ సైజ్‌తో ఉండేవారు కొన్ని టిప్స్ ఫాలో అయితే చీరల్లో అందంగా కనిపించవచ్చు. కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ.. మరికొన్ని ఫాలో అయితే మీరు కూడా శారీ లుక్‌ని పండుగలు, ఈవెంట్స్ సమయంలో కాన్ఫిడెంట్‌గా ట్రై చేయవచ్చు.
చీర ఎంపిక ఇలా ఉండాలి
కలర్స్ : చబ్బీగా లావుగా ఉండేవారు లైట్ కలర్ శారీలు ఎంచుకోకపోవడమే మంచిది. కాస్త డార్క్ ఉండే చీరలు బాగా నప్పుతాయి. బ్లాక్, నేవీ బ్లూ, డార్క్ బ్రౌన్ వంటి శారీలు స్లిమ్ లుక్‌ని ఇస్తాయి.
ఫ్యాబ్రిక్స్ : మార్టిన్, ఆర్గాంజో వంటి చీరలు అస్సలు ఎంచుకోకపోవడమే మంచిది. ఇవి మీరు మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మంచి లుక్‌ని ఇస్తాయి. షిఫాన్, జార్జెట్, కాటన్ వంటి చీరలు మంచి లుక్‌ని ఇస్తాయి. అలాగే కంఫర్ట్‌బుల్‌గా, సింపుల్, ఎలిగెంట్ లుక్‌ని ప్రమోట్ చేస్తాయి.
డిజైన్స్ : పెద్ద డిజైన్లు, పెద్ద బోర్డర్లు ఉండే శారీలు మీకు అంతగా నప్పవు. కాబట్టి బోల్డ్ ప్రింట్స్, ఫ్లోరల్స్ వంటి మంచి లుక్‌ని ఇస్తాయి. లేదంటే మీరు పూర్తిగా ప్లెయిన్ శారీలు కట్టుకోవచ్చు. హెవీ వర్క్ చేసిన శారీలు మీ లుక్‌ని మరింత ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. ప్లెయిన్ శారీలు సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండేలా చేస్తాయి.
బ్లౌజ్ ఎంపిక : స్లీవ్ లెస్ బ్లౌజ్‌లు వేసుకునే బదులు.. హాఫ్ స్లీవ్స్ వేసుకుంటే మంచిది. అలాగే ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే నెట్ హ్యాండ్స్ ఉండేలా చూసుకోండి. ఇవి మీ లుక్‌ని స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉండేలా చేస్తాయి.
బోర్డర్ లుక్ : బోర్డర్ సేమ్ కలర్ శారీలు ఎంచుకోకపోవడమే మంచిది. కాంట్రాస్టింగ్ కలర్ బోర్డర్ ఉండే శారీలు మంచి లుక్‌ని ఇస్తాయి.
స్టైలింగ్ టిప్స్
బెల్ట్ బ్లౌజ్ స్టైలిష్ లుక్‌ని ఎలివేట్ చేస్తుంది. అలాగే నడుమును హైలెట్ చేస్తూ.. మంచి లుక్ ఇస్తుంది. మీ లుక్‌ని పెంచుకోవడానికి.. అట్రాక్ట్ చేయడానికి స్టేట్మెంట్ నెక్లెస్ లేదా భారీ ఇయర్ రింగ్స్ పెయిర్ చేయవచ్చు. నడుముకు సన్నని చైన్‌ని పెట్టుకుని స్టైల్ చేసుకోవచ్చు.
ఇలా కట్టేసుకోండి
చీర కట్టుకునే విధానమే మీ లుక్‌ని హైలెట్ చేస్తుంది. ఎంత మంచి చీర అయినా సరిగ్గా కట్టుకోకుంటే అది మీ లుక్‌ని డల్ చేస్తుంది. అందుకే పల్లు పెట్టుకునేప్పుడు కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అలాగే కుచ్చులు కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. మడతలు లేకుండా ఉండేలా డ్రేప్ చేస్తే లుక్ బాగుంటుంది.
మరిన్ని టిప్స్
శారీ కట్టుకుని మీలో కాన్ఫిడెన్స్ లేకుంటే మీరు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా లుక్ బాగుండదు. మీరు చీరను కాన్ఫిడెంట్‌గా లీడ్ చేస్తే మీ గ్లో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రాక్ చేయొచ్చు. అలాగే మీ శారీలుక్ని డిఫరెంట్‌గా ట్రై చేయవచ్చు. ఫ్యాషన్ అప్డేట్ చేస్తూ శారీ కట్టుని మార్చుకోవచ్చు. అలాగే మీ నెగిటివ్స్పై కాకుండా పాజిటివ్ అంశాలపై దృష్టి పెట్టండి. మంచి చీరను ఎంచుకుని, స్టైలిష్‌గా దానిని ఎలా కట్టుకోవచ్చో తెలుసుకోండి. ఇవన్నీ మీరు చబ్బీగా ఉన్నా మంచి లుక్‌ని అందిస్తాయి.






















