Rashmika Mandanna Sleeveless Blouse Collection : స్లీవ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు శారీని ఎలా స్టైల్ చేయవచ్చో తెలుసా? సింపుల్, ఎలిగెంట్స్ లుక్స్ కోసం రష్మికను ఫాలో అయిపోండి
Rashmika Mandanna : ట్రెడీషనల్ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకునేవారు చీర కట్టుకుంటే స్లీవ్ లెస్ బ్లౌజ్‌లు వేసుకుంటారు. మీరు కూడా వారిలో ఒకరు అయితే ఈ లుక్స్ ట్రై చేయవచ్చు.
Rashmika Mandanna Sleeveless Blouse Saree Look : కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిలు కాలేజ్ ఫెస్ట్‌ల సమయంలో చీరలు కట్టుకుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగల సమయంలో చీరను కట్టుకున్నా.. స్టైలిష్‌గా కనిపించాలనుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే మీరు కచ్చితంగా రష్మిక మందన్నా లుక్స్‌ని ఫాలో అయిపోవాల్సిందే. ఎందుకంటే రష్మిక దాదాపు తను కట్టుకునే చీరలపై స్లీవ్ లెస్ బ్లౌజ్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. మరి ఆ లుక్స్ మీరు ఎలా రీక్రియేట్ చేయొచ్చో.. ఇప్పుడు చూసేద్దాం.
హెయిర్ బన్..
స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా హెయిర్ బన్ వేసుకుని.. సింపుల్‌గా రెడీ అవ్చొచ్చు. అలాగే మెడలో ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా.. చెవులకు మాత్రం పెద్ద ఝుంకాలు పెట్టుకుంటే బాగుంటుంది. లైట్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు డార్క్ ఐషాడో వేసుకుంటే మీ లుక్స్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటాయి.
క్యూట్ హ్యాండ్ బ్యాగ్‌తో..
స్లీవ్ లెస్ బ్లౌజ్‌కి ఫ్రెంట్ బికినీ షేప్‌లో వచ్చేలా డిజైన్ చేయించుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. అలాగే వెనుక ఇలాంటి కుచ్చులు పెట్టుకుంటే ఫంకీగానూ ఉంటుంది. ఈ లుక్‌ని మీరు గులాబీలతో స్లే చేయవచ్చు. అలాగే మెడలో చోకర్, చేతికి హ్యాండ్ పెట్టుకుంటే బాగా కనిపిస్తారు.
బీడ్స్ కలెక్షన్‌తో
పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా.. రష్మిక కట్టుకున్న బ్లూ శారీ అందరి మనసు దోచేసింది. ఈ శారీ లుక్‌ని కూడా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తోనే పెయిర్ చేసింది. అయితే ఈసారి మెడలో ఎలాంటి ఆభరణాలు లేకుండా.. చెవులకు, చేతులకు మాత్రం బీడ్స్‌తో కూడిన జ్యూవెలరీ పెట్టుకుంది రష్మిక. సింపుల్‌గా, క్యూట్‌గా, ట్రెండీగా కనిపించాలంటే ఇవి బెస్ట్.
శాటిన్ శారీతో..
శాటిన్ చీరను కూడా ఇలాంటి స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పెయిర్ చేసుకోవచ్చు. స్టోన్స్‌తో కూడిన ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్లెట్ని రష్మిక పెయిర్ చేసింది. హెయిర్‌ను లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్ లుక్‌లో మీరు కూడా అందంగా ముస్తాబు కావొచ్చు.
ఎల్లోశారితో ఎలా పెయిర్ చేయవ్చచంటే..
రష్మిక ఈ స్లీవ్ లెస్ బ్లౌజ్‌ని ఈసారి బిగ్ రిబ్బన్స్‌తో పెయిర్ చేసింది. హెయిర్‌ని కర్ల్స్ లేకుండా స్ట్రైయిట్ లుక్‌లో ఉంచుకుంది. మెడకు చౌకర్ పెట్టుకుని.. చెవులకు స్టోన్స్ ఇయర్ రింగ్ పెట్టుకుంది.
డీప్ నెక్
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని డీప్ నెక్‌గా కూడా మీరు కుట్టించుకోవచ్చు. ఇలాంటి డీప్‌నెక్ వేసుకున్నప్పుడు మెడలో పెద్ద నెక్లెస్‌ను వేసుకోవచ్చు. కాటుక పెట్టుకుంటే మీరు మీ లుక్ మరింత అందంగా మారిపోతుంది.
పండుగల సమయంలో..
పండులగల సమయంలో మీరు ఇలాంటి చీరను ఎంచుకుంటే.. స్లీవ్‌లెస్ లుక్‌ని ట్రెడీషనల్గా మార్చుకోవచ్చు. మెడలో, చెవులకు, చేతికి జ్యూవెలరీ పెట్టుకోవాలి. అలాగె చెంపసవరాలు మీ లుక్‌ని మరింత అందంగా మార్చేస్తాయి. తలలో పూలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని ఇలా అందంగా ముస్తాబైతే.. పండుగ శోభ అంత మీ దగ్గరే ఉంటుంది.
మరి ఇంకేమి ఆలస్యం. మీరు కూడా ఈ పండుగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో స్లీవ్ లెస్ బ్లౌజ్‌లతో అందంగా శారీ లుక్‌ని పుల్ చేయవచ్చు. మరిన్ని లుక్స్కోసం మీరు రష్మిక మందన్న ఇన్‌స్టాని ఫాలో అవ్వండి.
Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్‌గా ముస్తాబై, స్టన్నింగ్‌గా కనిపించాలంటే కీర్తి సురేష్‌ని ఫాలో అయిపోండిలా