వెడ్డింగ్ సీజన్ మొదలైంది.. ప్రతి ఒక్కరికి అందంగా రెడీ అవ్వాలని ఉంటుంది. రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చీర కట్టిందంటే చాలు.. కుర్రకారు ఫిదా పుష్ప సినిమా తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ మధ్యకాలంలో రష్మిక మందన్న ట్రెండ్ మార్చి రంగు రంగుల చీరలతో అందర్ని ఆకట్టుకుంటుంది. పెళ్లికి సింపుల్ గా రెడీ అవ్వాలనుకునే వారికి ఈ చీర పర్ఫెక్ట్. పెళ్లిలో కలర్ ఫుల్ గా ఉండాలంటే ఇలాంటి చీర అయితే బెటర్. సంప్రదాయంగా వెళ్లాలనుకునే వారు ఇలాంటి చీరను కట్టుకుంటే రష్మిక మందన్న లా మీరు కూడా మెరిసిపోతారు. ఇప్పుడు అందరి చూపు ఈ ముద్దుగుమ్మ కట్టే చీరలపైనే ఉంది.. మీరు కూడా ఈ బ్యూటీని ఫాలో అవ్వండి. పెళ్లిలో మీరు కూడా ఈ ముద్దుగుమ్మ లాగే అందరికి క్రష్ గా మారిపోతారు.