ప్రముఖ నటి స్నేహా ఉల్లాల్ ఇండస్ట్రీలోకి సర్రున దూసుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో ఐశ్వర్యా రాయ్ లాగానే ఉన్నారని స్నేహా ఉల్లాల్‌కి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ సినిమాతోనే స్నేహా ఉల్లాల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2005లో వచ్చిన ‘లక్కీ’ స్నేహా ఉల్లాల్ మొదటి సినిమా. ఆ వెంటనే సొహైల్ ఖాన్ సినిమా ‘ఆర్యన్’లో కూడా నటించారు. తెలుగులో ‘నేను మీకు తెలుసా?’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాల్లో కనిపించారు. అనంతరం బాలకృష్ణ సరసన ‘సింహా’లో సందడి చేశారు. స్నేహా ఉల్లాల్ ఇప్పటికీ నటిస్తూ బిజీగా ఉన్నారు. 2022లో ‘లోకంత్ర’ అనే సినిమాలో నటించారు. అంతకు ముందు 2020లో ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు.