ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, సీనియర్ నటి సుజిత ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. సుజిత ధనుష్ కట్టే చీరలంటే మహిళలకు భలే ఇష్టం. ఆమె కట్టే చీరలకే అభిమానులు ఉన్నారంటే ఎవరూ నమ్మలేరు. వదినమ్మ సీరియల్‌లో కట్టిన చీరలతో సుజిత ధనుష్ బాగా ఫేమస్ అయింది. ఇక అప్పటినుంచి అందరి చూపు ఈ ముద్దుగుమ్మ కట్టే చీరల మీదే ఉంది ఈ పసుపు రంగు చీరలో సుజిత ధనుష్ భలే మెరిసిపోతోంది కదూ. చీరకు తగ్గట్టు చెవిపోగులు, మెడలో దండతో భలే అందంగా ఉంది సుజిత. ఈ ప్రింటెడ్ పసుపు రంగు చీరలో సుజిత ధనుష్ భలే ముద్దుగా ఉంది. ఈ ఎరుపు రంగు చీరలో కుందనపు బొమ్మలా ఉంది సుజిత. మరి మీరు కూడా ఈమెలాగే వేడుకల్లో అందంగా కనిపించండి.