I’m Not a Robot OTT Platform : 'అనూజ' ఆస్కార్ కలను చెదరగొట్టిన 'ఐయామ్ నాట్ ఏ రోబో' స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందంటే ?
Oscar 2025 winner Im Not a Robot OTT Platform : 'అనూజ'తో పోటీ పడి, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ ను సొంతం చేసుకున్న ఐయామ్ నాట్ ఏ రోబోట్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Oscar 2025 Best Live Action Short Film Im Not a Robot OTT Platform and Release Date Details:ఈసారి భారత్ కు 'అనూజ' అనే షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డును తెచ్చిపెడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇండియన్ మూవీ లవర్స్. కానీ ఆశలను ఆవిరి చేస్తూ 'అనూజ' అందుకుంటుంది అనుకున్న ఆస్కార్ అవార్డుని అమాంతం ఎగరేసుకుపోయింది మరో డచ్ భాషా షార్ట్ ఫిలిం అయామ్ నాట్ ఏ రోబోట్. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం టైటిల్ ను ఈ మూవీ అందుకోవడంతో ఆస్కార్ పై మనోళ్ళ ఆశలు ఆవిరైపోయాయి.
'ఐయాం నాట్ ఏ రోబోట్' ప్రత్యేకత ఏంటంటే?
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2025 ఆస్కార్ అవార్డులను తాజాగా విన్నర్స్ కు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల బాలిక కథ ఆధారంగా నిర్మించిన 'అనూజ' చిత్రం కూడా ఈ అవార్డ్స్ లో నామినేషన్ ను సొంతం చేసుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో నామినేట్ అయిన ఈ మూవీని పక్కకు నెట్టి 'ఐయాం నాట్ ఏ రోబోట్' మూవీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.
'ఐయాం నాట్ ఏ రోబోట్' అనేది ఒక డచ్ భాష షార్ట్ ఫిలిం. ఈ మూవీ 2023లోనే రిలీజ్ అయింది. దీనికి విక్టోరియా వార్మర్ డామ్ దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయనే రాయడం విశేషం. ఈ మూవీలో నటి ఎల్లెన్ పెర్రెన్, నటుడు హెన్రీ వాన్ లూన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ షార్ట్ ఫిలింను నెదర్లాండ్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. అక్కడ ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వేదికలపై అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది.
Read Also : ఐదు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన 'అనోరా'... ఇండియాలో ఏ ఓటీటీలో సినిమా చూడవచ్చో తెలుసా?
'ఐయాం నాట్ ఏ రోబోట్' కథ
'ఐయాం నాట్ ఏ రోబోట్' కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయిన లారా జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడు, ఓ షాకింగ్ సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఆమె మనసులో "నేను రోబోనేమో" అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న ఆమెను ఎంతగానో బాధపెడుతుంది. లారా అలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక క్యాప్చా ఫిల్లింగ్.
చాలాసార్లు వెబ్సైట్స్ ని ఓపెన్ చేసినప్పుడు, మనం రోబోట్ కాదని నిర్ధారించడానికి క్యాప్చాను ఫిల్ చేయమని అడుగుతారు. అది పాస్ అయితేనే వెబ్సైట్లోకి ఎంటర్ కాగలుగుతాము. ఇక 'ఐయాం నాట్ ఏ రోబోట్' సినిమాలో కూడా హీరోయిన్ ఇలాగే క్యాప్చ ఫిల్లింగ్ చేస్తుంది. కానీ ఎన్నిసార్లు చేసినా ఆమె ఫెయిలవుతుంది. దీంతో తను రోబోనేమో అని భావించి, ఆందోళన పడుతుంది. ఆ తర్వాత తను రోబోనా, మనిషినా? అని తేల్చుకోవడానికి ఓ షాకింగ్ పని చేస్తుంది. ఆమె ఏం చేసిందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్లో ఫ్రీగానే అవైలబుల్ గా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

