SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
SBI పీవో-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.

SBI PO Admitccards: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. మార్చి 24 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 8, 16, 24 తేదీల్లో పీవో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 27న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిలో ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ-158, ఈడబ్ల్యూఎస్- 58, యూఆర్- 240 పోస్టులు కేటాయించారు. అభ్యర్థుల నుంచి డిసెంబరు 27 నుంచి జనవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480 - రూ.85,920 మధ్య జీతభత్యాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ¼ వంతు మార్కులు కోత విధిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 27.12.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 16.01.2025.
➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి 3 లేదా 4 వారం నుంచి.
➥ స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 08.03.2025, 15.03.2025
➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 2025లో
➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్ 2వ వారం నుంచి.
➥ స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: ఏప్రిల్/మే 2025.
➥ మెయిన్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాల విడుదల: మే/జూన్ 2025.
➥ ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/జూన్ 2025.
➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/జూన్ 2025.
➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: మే/జూన్ 2025.
➥ తుది ఫలితాల వెల్లడి: మే/జూన్ 2025.
➥ ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ఫిబ్రవరి 2025.
➥ ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2025, ఫిబ్రవరి 2025.





















