శోభిత, నాగచైతన్య పెళ్లి పనులు మొదలైపోయాయి. దానికి సంబంధించిన అప్డేట్ శోభితా ఇచ్చేసింది.

Godhuma Raayi Pasupu danchatam 🦜🪷♥️ And so it begins! పెళ్లి కబురు ఇచ్చింది శోభిత.

అయితే అసలు ఈ గోధుమ రాయి పసుపు దంచటం అంటే ఏమిటి? దీనిని ఎందుకు చేస్తారో చూసేద్దాం.

పెళ్లి పనులు ప్రారంభానికి గుర్తుగా గోధుమ రాయి.. పసుపు దంచటం వంటి కార్యక్రమాలు చేస్తారు.

ఈ వేడుకలో భాగంగా తిరగలి, రోలు, రోకలిని పూజించి.. పెళ్లి పనులకు సిద్ధమవుతారు.

పూజ చేసిన రోకలిలో పసుపు దంచుతారు. పసుపును శుభసూచకంగా భావిస్తూ.. వాటిలో పసుపు దంచుతారు.

సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకునేవారు కచ్చితంగా ఈ గోధుమ రాయి చేసుకున్న తర్వాతనే పెళ్లి పనులు ప్రారంభిస్తారు.

తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని అస్సలు స్కిప్ చేయరు.

ప్రస్తుతం శోభిత, నాగచైతన్యలు కూడా ఈ తరహాలోనే తమ వివాహ జీవితంవైపు అడుగులు వేస్తున్నారు.

మరికొద్దిరోజుల్లో నాగచైతన్య, శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. (Images Source : Instagram/Sobhita)