పుష్ప 2 లో సమంత - ఊ ఊ కాదు ఊ అనాల్సిందే!
ఊ అంటావా మావా .. ఊ ఊ అంటావా అనే సాంగ్ ఏ రేంజ్ లో సన్షేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..
పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..కానీ సమంతని మ్యాచ్ చేసే హీరోయిన్ దొరకడం లేదు..
స్టార్టింగ్ లో సమంతను అడిగారు కానీ అప్పట్లో ఆమె ఆరోగ్య బాలేకపోవడంతో నో చెప్పేసింది..నటనకు చిన్న బ్రేక్ ఇచ్చింది..ఇప్పుడు మళ్లీ దూసుకొచ్చింది
ఇప్పటికీ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది.. జాన్వి కపూర్, త్రిప్తి దిమ్రి సహా చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు కానీ ఊఊ నే వినిపించింది
దీంతో మళ్లీ చుట్టూ తిరిగి మళ్లీ సమంత దగ్గరే ఆగారట పుష్ప 2 మేకర్స్.. మళ్లీ సమంతను సంప్రదించే ఎస్ చెప్పిందని టాక్.
సమంతని స్పెషల్ సాంగ్ కోసమా లేదా స్పెషల్ రోల్ కోసమా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది నిజంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూసే మరి..
డిసెంబరు 06న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 థియేటర్లలో సందడి చేయబోతోంది.. డేట్ మారుతుందనే ప్రచారం జరిగినా డిసెంబరు 6నే అని క్లారిటీ ఇచ్చేశారు
పుష్ప పార్ట్ 1 స్పెషల్ సాంగ్ ఊ అంటారా మావా ఊఊ అంటారా మావా సాంగ్ ని మించి సెకండ్ పార్ట్ లో సాంగ్ ఉండబోతోందట..
పుష్ప 2 లో సాంగ్, స్పెషల్ రోల్ తో పాటూ..పుష్ప 3 లోనూ సమంతను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట..ఇంతకీ సమంత ఊ అన్నట్టేనా...