మోక్షజ్ఞ కు తల్లిగా బాలయ్య హీరోయిన్!
నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రాబోతోంది
ఓ వైపు మూవీలో హీరోయిన్ కోసం వేట సాగుతోంది..ఇంకో వైపు ఈ మూవీలో హీరో తల్లి క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారట
తనయుడి మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న బాలకృష్ణ.. మూవీలో క్యారెక్టర్స్ విషయంలోనూ తనవంతు సలహాలు, సూచనలు ఇస్తున్నారట
మోక్షజ్ఞ సినిమాలో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఇందుకోసం చాలామంది పేర్లు పరిశీలించి చివరకు శోభనను ఫైనల్ చేశారని టాక్
శోభన గతంలో బాలయ్యతో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. నారీ నారీ నడుమ మురారి , మువ్వగోపాలుడు మూవీస్ లో నటించింది
లాంగ్ గ్యాప్ తర్వాత శోభన రీసెంట్ గా ప్రభాస్ కల్తి 2898 AD మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది
ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోక్షజ్ఞ మూవీలో తల్లి క్యారెక్టర్ తో రాబోతోందని టాక్. ఇప్పటికే శోభనను సంప్రదించడం ఆమె ఓకే చెప్పడం జరిగిందట
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ మూవీ అంటే భారీ అంచనాలున్నాయ్.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు..ఇప్పుడు ఈ సినిమా అప్ డేట్స్ చూసి హిట్ పక్కా ఫిక్సైపోయారు