రెండు భాగాలుగా 'SSMB29'
మహేష్-రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న SSMB29 పాన్ వరల్డ్ మూవీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
SSMB29 మూవీ రెండు భాగాలుగా రాబోతోందనే డిస్కషన్ జరుగుతోంది. ఇదే నిజమైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద షాకే..
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని..ఇందులో క్యారెక్టర్ కి తగ్గట్టుగా మహేశ్ లాంగ్ హెయిర్, గెడ్డంతో రెడీ అయిపోయాడు
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది..క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట రాజమౌళి..ఈ మొత్తం అప్ డేట్ ఒకేసారి రానుందని టాక్
1500 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది
ఈ మూవీ గురించి లేటెస్ట్ గా వచ్చిన అప్ డేటే...బాహుబలి లా రెండు భాగాలుగా రాబోతోందని. కథ, బడ్జెట్ దృష్టిలో పెట్టుకునే జక్కన్న ఇలా ప్లాన్ చేశారా అనే డిస్కషన్ నడుస్తోంది
రాజమౌళి ఒక్కో సినిమాకు కనీసం ఐదేళ్లు సమయం తీసుకుంటాడు.. ఇక రెండు భాగాలంటే పదేళ్లు ఫిక్సైపోలేమో. అంటే ఈ పదేళ్లు మహేష్ బాబు మరో ప్రాజెక్ట్ చేసే ఛాన్సు ఉండదా అని ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ మొదలైంది
‘SSMB29’ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకూ వాస్తవం ఉందో తెలియదు.. జక్కన్న క్లారిటీ ఇస్తేకానీ!