రజనీకాంత్, ప్రభాస్, సూర్య.. ఫ్యాన్స్ కి పండుగే!

Published by: RAMA

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన పాన్-ఇండియా మూవీ కంగువ నవంబర్ 14న విడుదలవుతోంది. మొత్తం 8 భాషల్లో వస్తోంది కంగువ

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

ఆడియో రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్ గా నిర్వహించే అదే పెద్ద ప్రమోషన్ అని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభాస్ , రజనీకాంత్ ని తీసుకురావాలని మేకర్స్ ఫిక్సయ్యారట

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

యూవీ బ్యానర్ అధినేతలు​ వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి​ స్నేహితులు. అందుకే అడిగితే రెబల్ స్టార్ నో చెప్పడు అనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు...

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

మరోవైపు దర్శకుడు శివ ఆహ్వానిస్తే రజనీకాంత్ ఎస్ చెప్పే ఛాన్సుంది. పైగా వేట్టయాన్ కోసం కంగువా మూవీ వాయిదా వేసుకున్నాడు సూర్య.. అందుకోసమైనా రజనీకాంత్ వస్తారని టాక్

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

తనపై గౌరవంతో మూవీ రిలీజ్ వాయిదా వేసుకున్న సూర్య మూవీని ప్రమోట్ చేయాలని రజనీకాంత్ వస్తున్నారని తెలుస్తోంది

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన కంగువ లో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు నిర్మాతలుగా వ్యవహరించాయి

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

రజనీకాంత్, ప్రభాస్, సూర్య..ఒకే వేదికపై అంటే అభిమానులకు అంతకుమించిన పండుగ ఏముంటుంది

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

3,500 థియేటర్లలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్‌, స్పానిష్‍లోనూ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ చెప్పాడు

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి...వెయ్యికోట్ల వ్యయంతో రూపొందిన మూవీ 2 వేల కోట్లు రాబడుతుందని అంచనా..

ఒకే వేదికపై రజనీకాంత్ - ప్రభాస్

ఇప్పటికే కంగువ పార్ట్ 2, పార్ట్ 3 స్టోరీస్ సిద్ధంగా ఉన్నాయి.. పార్ట్ 1 రిజల్ట్ చూసిన తర్వాత వాటిపై డెసిషన్ తీసుకోనున్నారని టాక్..