నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. రష్మిక మందన్న ‘పుష్ఫ 2’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రష్మిక మందన్న నటించిన మరో బాలీవుడ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘చావా’నే ఆ సినిమా. ఇందులో విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఎన్నో క్రేజీ సినిమాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’ల్లో రష్మికనే హీరోయిన్. ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు.