నాగార్జునకి కాబోయే కోడలు అసలు ఏ జాబ్ చేయాలి అనుకుందో తెలుసా!
అక్కినేని నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ హీరోయిన్ అవుదాం అనుకోలేదట.. ఆ విషయం స్వయంగా ఆమె చెప్పింది
శోభితా దూళిపాళ తెనాలికి చెందిన వేణుగోపాల్ రావు కుమార్తె. తండ్రి నేవీ ఇంజినీర్, తల్లి స్కూల్ టీచర్. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ లోనే ఎక్కువ మూవీస్ లో నటించింది.
శోభిత చేసిన క్యారెక్టర్స్ తో బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది..సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ కూడా అలానే ఉంటాయ్
ఎక్కువ కాలం విశాఖలో పెరిగిన శోభిత ఆ తర్వాత స్టడీస్ కోసం ముంబై వెళ్లింది. మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొంది..హీరోయిన్ గా వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడింది...
వాస్తవానికి హీరోయిన్ కావాలన్నది ఆమె డ్రీమ్ కాదంటూ లేటెస్ట్ గా ఆమె జాబ్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రపతికి చీఫ్ ఎకనమిస్ట్ అడ్వెయిజర్‌గా వర్క్ చేయాలని కలలు కందట..అందుకే తన ప్రెండ్స్ సరదాగా మూవీస్ గురించి మాట్లాడినా శోభిత ఎప్పుడూ ఎకనమిస్ట్ ల గురించి డిస్కస్ చేసేదట
రామన్ రాఘవ్ 2.0తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శోభిత..తెలుగులో గూఢచారి, మేజర్ మూవీస్ లో నటించింది. హిందీలో చెఫ్, కాలకాండి, ది బాడీ.. తమిళంలో PS1, PS2 లో నటించంది.
ఈ మధ్యే లవ్ సితార మూవీలో నటించింది..త్వరలో చైతూని పెళ్లి చేసుకుని అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టబోతోంది శోభిత..