నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తన పేరును నయనతారగా మార్చుకుంది.
నయనతార తన మొదటి సినిమా మలయాళం నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. మనసునక్కరే సినిమాతో తొలిసారిగా తెరపై కనిపించింది. అనంతరం తమిళంలో సినిమాలు చేసింది.
చంద్రముఖి సినిమాతో నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్లో ఈమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
చేసింది సెకండ్ హీరోయిన్ అయినా.. పాత్ర నిడివి తక్కువ అయినా.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది నయన్. అలాంటి వాటిలో గజిని సినిమా కూడా ఒకటి. కెరీర్ తొలినాళ్లలో ఈ సినిమా ఆమెకు ఓ టర్నింగ్ పాయింట్ అయింది.
హీరోతో కలిసి కమర్షియల్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది నయనతార.
డోరా సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచింది నయనతార. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినా.. ఆమె నటనకు మంచిగుర్తింపు వచ్చింది.
క్రైమ్ కామేడీ చిత్రంగా తెరకెక్కిన కొలమావు కోకిల సినిమాలో డ్రగ్ పెడ్లర్‌గా నటించింది నయన్. హీరోయిన్గా ఏ నటి ఇలాంటి డ్రగ్ పెడ్లర్‌గా చేయకపోవడంతో ప్రేక్షకులకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
జిల్లా కలెక్టర్ సెటిల్డ్ యాక్టింగ్‌తో.. సెన్సిటివ్ టాపిక్‌ని తెరపైకి తెచ్చింది నయన్. ఈ సినిమా తెలుగులో కర్తవ్యం అనే పేరుతో విడుదలైంది. టాలీవుడ్లో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది.
నెట్రికన్ సినిమాతో తనలోని నటికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఒకటి. బ్లైండ్ ఉమెన్ పాత్రలో సీరియల్ కిల్లర్‌ని పట్టించిన తీరు ప్రేక్షకులను బాగా కన్విన్స్ చేసేలా చేసింది నయన్.
విజయ్ సేతుపతితో కలిసి నయన తార నానుమ్ రౌడీ తాన్ అనే సినిమా చేసింది. ఇది తెలుగులో నేను రౌడీనే పేరిట మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నయన్ యాక్టింగ్, విజయ్ నటన, మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అనామిక, మాయ, o2, వాసుకి, అన్నపూర్ణని వంటి సినిమాలతో తన నటనతో ఎంతో గుర్తింపుతెచ్చుకుంది నయన్. ఇప్పటికీ మార్కెట్లో ఆమె సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.
నయనతార తెలుగు, తమిళం, మలయాళం, బాలీవుడ్‌లలో నటించింది. ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ భామ అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరు.