Viral News: ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
Kiss: కలిసి ఉండాలంటే ఉండాల్సింది ప్రేమ, లిప్ కిస్సులతో ప్రపంచరికార్డులు సృష్టించినా ఆ ప్రేమ తగ్గిపోతే మాత్రం విడాకులు తప్పవు. ఈ జంట ఇదే నిరూపిస్తోంది.

Longest Kiss Record Holders: ప్రేమలో గెలవాలంటే మనసు ఉండాలి. ముద్దులు పెట్టుకుంటే ప్రేమ నిలబడదు. ఈ విషయాన్ని మరోసారి ఎక్కచై, లక్సానా అనే జంట నిరూపించింది. వీరిద్దరూ ప్రపంచ ముద్దుల పోటీలో విజేతలు. 58 గంటల పాటు ఒకరి పెదవులు ఒకరు విడిచి పెట్టకుండా ముద్దులు పెట్టుకుని గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు.
Married couple who hold world record for the longest kiss share tragic update on their relationship
— MassiVeMaC (@SchengenStory) February 25, 2025
World record holders Ekkachai & Laksana Tiranarat have parted ways
A once besotted couple who broke the record for the longest kiss have sadly revealed they're no longer together pic.twitter.com/63r3NNbnxO
వీరు ఇప్పుడు తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. తమ మధ్య అనుబంధం తగ్గిపోయిందని .. కలిసి బతకడం కష్టంగా ఉందని అందుకే విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
Longest kiss? Ekkachai & Laksana Tiranarat (Thailand) kissed for 58 hrs 35 mins and 58 secs, #ValentinesDay 2013 pic.twitter.com/YNWh14pBZh
— Guinness World Records (@GWR) February 14, 2016
థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో నిర్వహించిన పోటీల్లో ఎక్కచై , లక్సానా వార్షిక పోటీలో ఎనిమిది జంటలను ఓడించారు. 58 గంటల పాటు ఒకరి పెదవులు మరొకరి పెదవులతో పెన వేసి ముద్దులు పెట్టుకున్నారు. 100,000 థాయ్ బట్లతో పాటు 100,000 థాయ్ బట్ విలువైన రెండు వజ్రాల ఉంగరాలను గెలుచుకున్నారు. ఫిబ్రవరి 12, 2013న ప్రారంభమై రెండు రోజుల తర్వాత ప్రేమికుల రోజున ముగిసింది.
ముద్దుల పోటీలు చాలా కఠినంగా ఉంటాయి. పెదవులు విడిపోకుండా ముద్దు నిరంతరం ఉండాలి. పెదవులు విడిపోతే పోటీకి అనర్హులవుతారు. పోటీలో ఉండగా స్ట్రా ద్వారా మాత్రమే ద్రవపదార్థాలు తీసుకునే అవకాశం ఉంది. పోటీలో ఉన్నంత వరకు కంటెస్టెంట్లు మేల్కొనే ఉండాలి. నిలబడే ఉండాలి.. ఒకరి సాయం ఒకరు తీసుకోకూడదు. విశ్రాంతి సమయం ఉండదు. అడల్ట్ నాపీలు లేదా డైపర్ల వంటి ఇన్‌కంటినెన్స్ ఉపయోగించకూడదు. అ ఈ కఠిన నిబంధనలతో రికార్డులు బద్దలు కొట్టే సమయంలో కంటెస్టెంట్ అనేక ఇబ్బందులపాలయ్యారు.
పోటీలో రికార్డు సమయంలో క్రమంగా పెరుగుతుండటంతో పోటీ దారులు నిద్రలేమి, డిప్రెషన్‌కు గురవడం గుర్తించామని గిన్నిస్ వర్గాలు తెలిపాయి. 1999నుంచి నిర్వహిస్తున్న ఈ లాంగెస్ట్ కిస్సింగ్ రికార్డుల్లో జరిగిన కొన్ని ఘటనల కారణంగా ఆ తర్వాత పోటీలను నిర్వహించలేదు. వేర్వేరు నిబంధనలతో నిర్వహిస్తున్నారు. కానీ.. వీరి రికార్డును మాత్రం ఎనరూ బద్దలు కొట్టలేకపోయారు.





















