'కృష్ణమ్మ' మూవీ రివ్యూ, నారా రోహిత్ 'ప్రతినిధి 2' రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
!['కృష్ణమ్మ' మూవీ రివ్యూ, నారా రోహిత్ 'ప్రతినిధి 2' రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే! Top 5 Entertainment Updates Latest Movie and TV News From ABP News May 10th 2024 'కృష్ణమ్మ' మూవీ రివ్యూ, నారా రోహిత్ 'ప్రతినిధి 2' రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/cafb0ece53cad98ab1f4c8ffe86650eb1715340000648929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్‌పై సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్
Samyuktha Menon Shocking Comments on Tollywood: హీరోయిన్ సంయుక్తి మీనన్... ఈ మధ్య తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులో అడుపెట్టిన ఈ బ్యూటీ ఇక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్, హిట్స్ అందుకుంటుంది. భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలతో మాలీవుడ్, టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సంయుక్తి మీనన్ టాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Nara Rohit's Prathinidhi 2 Movie Review: కొంత విరామం తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా 'ప్రతినిధి 2'. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి'తో ఆయన విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు 'ప్రతినిధి 2' అనేసరికి ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి ఏర్పడింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో పొలిటికల్ కాంట్రవర్సీ ఉందా? లేదంటే రాజకీయ నేపథ్యంలో థ్రిల్లర్ సినిమా తీశారా? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Satyadev's Krishnamma movie review in Telugu: సత్యదేవ్ నటనకు అభిమానులు ఉన్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన స్టార్లలో ఆయనొకరు. తొలుత చిన్న చిన్న వేషాలు వేసి... కథానాయకుడి స్థాయికి వచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'కృష్ణమ్మ'. అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో తెరకెక్కిన సినిమా కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రైవేట్ వీడియో.. పరువు పోయిందంటూ జగతి మేడం ఆవేదన!
Jyothi Rai Becomes Deepfake Victim Says Police: గత రెండు రోజులుగా ప్రముఖ టీవీ నటి జ్యోతిరాయ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో నెట్టింట వైరల్ కావడం పట్ల జ్యోతిరాయ్ సీరియస్ అయ్యింది. తన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. జ్యోతిరాయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో డీప్ ఫేక్ వీడియోగా గుర్తించారు. కొంత మంది దుండగులు కావాలనే ఆమె వీడియోను మార్ఫ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అలాంటి రొమాన్స్ ఫస్ట్ టైమ్ చేశా
Shruti Sharma About Heeramandi Intimate Scenes: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మనీషా కొయిరాలా, సోనాక్షీ సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ కీలక పాత్రలు పోషించారు. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పాకిస్తాన్ లోని వేశ్య గృహాల్లోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా భాగస్వాములు అయ్యారనే కథాశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రస్తుతం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)