Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake in Prakasam District: ప్రకాశం జిల్లా గజగజ వణికిపోయింది. ముఖ్యంగా రెండు మండల ప్రజలకు ముచ్చెమటలు పట్టాయి. భూప్రకంపనలతో ఒక్కసారిగా జనం పరుగులు తీశారు.
Prakasam District: ప్రకాశం జిల్లాలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. ముండ్లమూరు మండలం, తాళ్ళూరు మండలంలో భూ ప్రకంపనలు ఆందోళనకలిగించాయి. భూమి కదలడంతో ఇంట్లో ఉన్న జనం ఒక్కసారిగా వీధుల్లోకి పరుగులు తీశారు. శంకరాపురం, పసుపుగుల్లు, వేంపాడు, గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురం, పోలవరం గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఐదు తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా బయటకు భయంతో పరుగులు తీశారు. ఈ మధ్య కాలంలో తెలగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వస్తున్న భూ ప్రకంపనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ నెలలోనే రెండు చోట్లు ఇలాంటి ప్రకంపనలు వచ్చాయి.
డిసెంబర్ 4న తెలంగాణలో భూకంపం వచ్చింది. దీంతో హైదరాబాద్ సహా చాలా జిల్లాలు కొన్ని సెకన్లపాటు షేక్ అయ్యాయి. భూమి రెండు సెకన్ల పాటు మాత్రమే కంపించినా మొత్తం హైదరాబాద్ ఊగిపోయింది. జనం భయంతో బయటకు పరుగులు తీశారు. రెండు సెకన్లపాటు కంపించిన భూమి అందర్నీ భయాందోళనకు గురి చేసింది. దీని భూకంప కేంద్రాన్ని ములుగు జిల్లాలో గుర్తించారు.