Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Pawan Kalyan Latest News: నా పని నన్ను చేసుకోనివ్వండి. అధికారిక కార్యక్రమాల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టొద్దు. ఇలా జేజేలు కొడుతూ జీవితాలను పాడు చేసుకోవద్దని ఫ్యాన్స్‌కు పవన్ క్లాస్ పీకారు.
Pawan Kalyan Request: 100% స్ట్రైక్ రేటుతో పవన్ కల్యాణ్‌ను ఏపీకి డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చోబెట్టిన క్రెడిట్ అండ్ ఫాన్స్ దే. రాజకీయాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 21 కి 21 సీట్లు లభించాయంటే అది పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికుల కృషే అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆ ఫ్యానిజమే పవన్ కల్యాణ్‌కి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అంటే అవుననే చెప్పాలి. ఆ మాట చెప్పింది స్వయంగా పవన్ కల్యాణే.
నన్ను పని చేసుకుని ఇవ్వండి ప్లీజ్. : పవన్ కల్యాణ్
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర మన్యంలో పర్యటిస్తున్నారు. వర్షాన్ని, సెక్యూరిటీ నిబంధనలను సైతం పట్టించుకోకుండా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన్యంలో రోడ్లకు ఫౌండేషన్ వేస్తూ ముందుకు వెళుతున్నారు. బురదలోనే కాలినడకన పర్యటిస్తూ మన్యం ప్రజలతో ముచ్చటిస్తూ సాగిపోతున్నారు. అయితే ఆయనకు ప్రధాన ఇబ్బంది ఆయన ఫ్యాన్స్ నుంచే ఎదురవుతోంది. దీంతో జనసేనలో కొత్త చర్చను లేవనెత్తుతోంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా భారీ సంఖ్యలో వచ్చేస్తున్న ఫ్యాన్స్ ఆయనకు ప్రజలకు మధ్యలో అడ్డుగోడలా తయారవుతున్నారు.
కనీసం పవన్ కల్యాణ్‌ను సామాన్య ప్రజలతో మాట్లాడనివ్వకుండా " అన్నా అన్నా " అంటూ నో "OG పవర్ స్టార్ " అంటునో కేకలు పెడుతూ పవన్ పవన్ కల్యాణ్‌కే చిరాకు తెప్పిస్తున్నారు. మరికొంతమంది అయితే " కాబోయే సీఎం " అంటూ హోరెత్తిస్తున్నారు. దానితో పవన్ కల్యాణ్ కనీసం సామాన్య ప్రజలతో ముచ్చటించలేకపోతున్నారు. వారి సమస్యలను డైరెక్ట్‌గా తెలుసుకోలేక పోతున్నారు.
పవన్ కల్యాణ్‌లో సైతం ఫ్యాన్స్ ధోరణి అసహనం తెప్పిస్తోంది. దానితో తనను "మీసం తిప్పు అన్నా" అంటూ అరుస్తున్న ఫ్యాన్స్ ను ఉద్దేశించి నవ్వుతూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. " నేను మీసం తిప్పితేనో, గుండెలు బాదుకుంటేనో మీకు రోడ్లు రావు. చేతులు జోడించి ప్రధానిని అడిగితే వస్తాయి. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తేనే పరిష్కారమవుతాయి. నన్ను దయచేసి పని చేసుకోనివ్వండి. అంటు వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఫ్యాన్స్ మూకుమ్మడిగా మీద పడి అసలు తన పని చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను రోడ్డు కూడా చూడనివ్వకుండా మీద పడిపోతున్నారని అన్నారు. దీని వల్ల తాను రోడ్డు చూడకపోతే అసలు సమస్య ఉందని తనకెలా తెలుస్తందని అన్నారు. అందుకే ప్రజల కోసం పని చేసుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హీరోలను ఆరాధించడం బాగానే ఉంటుంది కానీ వారీకి జేజేలు కొడుతూ జీవితాలు పాడుచోసుకవద్దని వార్నింగ్ ఇచ్చారు. తనతోపాటు ఎవరికైనా జై కొడితే కడుపు నిండదని అన్నారు. ఇలా హీరోలు వెంట అరుస్తూ తిరుగుతూ భవిష్యత్తు పాడు చేసుకోకండని సలహా ఇచ్చారు. అభిమానం చూపండి కానీ మీ ఫ్యూచర్‌ని మీరే పాడు చేసుకోకండి" అంటూ క్లాస్ పీకారు.
ఫ్యాన్స్‌లో ఒకరు ఐలవ్‌యూ చెబితే... తిరిగి ఐలవ్‌యూ చెప్పిన పవన్ కల్యాణ్. తన బిడ్డలకి కూడా ఇన్ని సార్లు ఐలవ్‌యూ చెప్పలేదని అన్ని సార్లు తన ఫ్యాన్స్ చెప్పానని అన్నారు. వాళ్లకు ఏదైనా అయితే బాధ కలుగుతుందని అన్నారు. అందుకే ప్రజలకు మంచి చేసేలా సమాజానికి పనికి వచ్చేలా పని చేద్దామని పిలుపునిచ్చారు.
గతంలోనూ ఇంతే
"మిగతా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు.. పవన్ కల్యాణ్‌కి మాత్రం భక్తులు ఉంటారు " అంటూ ఒక టాక్ ఉంది. అయనంటే వారికున్న అభిమానం ఒక్కోసారి హద్దులు దాటిపోతోంది. మిగిలిన హీరోల ఫంక్షన్లలోనూ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలంటూ వారు చేసి హంగామా గురించి తెలిసిందే. ఇలాంటి ఒక సందర్భంలోనే అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్ " అంటూ చేసిన కామెంట్ ఇప్పటికీ పవర్ స్టారర్ అభిమానులు మర్చిపోలేరు.
కొన్నేళ్ల క్రితం గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పైకి అభిమాని దూసుకురావడంతో ఆయన బ్యాలెన్స్ కోల్పోయి బాయినెట్ పైన తూలి పడ్డారు. ఇవన్నీ ఒకెత్తు అయితే పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక అధికారిక కార్యక్రమాల్లో కూడా ఫ్యాన్స్ హంగామా ఎక్కువైంది. ప్రజలకు మంచి చేద్దాం అని తాను ప్రయత్నిస్తుంటే ఇలా కొంతమంది ఫ్యాన్స్ తనకు ప్రజలకు మధ్య ప్రజలకి మధ్య ఒక అడ్డంకిలా మారడాన్ని గమనించిన పవన్ "నన్ను పనిచేసుకోనివ్వండి అంటూ " సున్నితంగా మందలించారు. మరి ఇకనుంచైనా పీకే ఫ్యాన్స్ అధికారిక కార్యక్రమాల్లో హంగామా చేయకుండా ఉంటారేమో చూడాలి.
Also Read: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024