అన్వేషించండి

Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024

TDP News: రాహువు పట్టిన పట్టిక సెకండు అఖండమైన లోకభాంధవుడు అసలే లేకుండా పోతాడా అన్నట్టు టీడీపీ పడి లేచింది. లేదు రాదు రాబోదు అనుకున్న వారికి గట్టి సమాధనం చెప్పింది.

TDP News: ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ పొలిటికల్ గేమ్ ఆడిన తెలుగు దేశం పార్టీకి మరో లైఫ్ ఇచ్చిన సంవత్సరంగా 2024 అని చెప్పుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చిన పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది. ఇది విశ్లేషకులు అన్నమాట కాదు పార్టీ నేతల భావన. అలా భయపడుతున్న సమయంలో తెలుగుదేశాన్ని ఏకంగా అధికార పీఠంపై కూర్చోబెట్టిన ఏడాదిగా 2024 ఎప్పటికీ నిలిచిపోతుంది.  భవిష్యత్‌లో క్రైసిస్ వచ్చిన ప్రతిసారి ఈ సంవత్సరాన్ని స్ఫూర్తిగా చెప్పుకుంటుంది టీడీపీ. 

23 నుంచి 135కు.. పతనం నుంచి పునరుజ్జీవం వరకూ...!
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. దెబ్బతిన్న ప్రతిసారి అంతే బలంగా తిరిగి లేచింది. కానీ ఈసారి ఎదుర్కొన్న దెబ్బ అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో పార్టీకి తగిలిన దెబ్బ టిడిపి పునాదుల్ని కదిలించింది. కేవలం 23 సీట్లకు పరిమితం అయిపోవడంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసిపి 151 ఒక సీట్లను కైవసం చేసుకుంది. 

పార్టీ ఓడోపోవడం, జగన్ ప్రభుత్వం పెడుతున్న కేసులు చేస్తున్న విమర్శలకు కీలక నేతలు అందరూ దాదాపు సైలెంట్ అయిపోయారు. ప్రెస్ మీట్ లు పెట్టడానికి కూడా కొందరు నేతలు మాత్రమే ధైర్యం చేసేవారు. డైరెక్ట్ గా అసెంబ్లీలోనే చంద్రబాబు ను టార్గెట్ చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజలను సైతం షాక్‌కు గురిచేసాయి. దానితో మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీ లో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు ఆక్షణం నుంచి తన వ్యూహాలకు పదును పెట్టారు. 

మరోవైపు లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రంలో పర్యటన ప్రారంభించారు. ఆఆ  సమయంలో స్కిల్ స్కాం పేరు చెప్పి చంద్రబాబును జైల్లో వేసింది అప్పటి ప్రభుత్వం. ఇక టీడీపీ లేవదనే అంతా అనుకున్నారు. కానీ అప్పుడే పవన్ కల్యాణ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. 

పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించి దానికి బిజెపిని ఒప్పించి జగన్ పై పోరాటం మొదలుపెట్టారు. జైలు నుంచి వచ్చిన క్షణం నుంచి చంద్రబాబు అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు జైలు శిక్షతో ప్రజల్లో వచ్చిన సానుభూతిని టిడిపికి ఓట్ల రూపంలోకి మార్చడంలో చంద్రబాబు ఫుల్ సక్సెస్ అయ్యారు. 

అన్నింటికీ మించి పవన్ అండతో ఆంధ్రప్రదేశ్ కనిగవినీ ఎరగని గెలుపును సొంతం చేసుకుంది కూటమి. 23 సీట్లతో ఆల్మోస్ట్ పార్టీ పని అయిపోయింది అనుకున్న స్థితి నుంచి 135 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటింది టీడీపీ. ఇంతటి గెలుపు టీడీపీ సైతం ఊహించలేదు.

ఆచితూచి అడుగులు వేస్తున్న చంద్రబాబు
2024 ఇచ్చిన గెలుపు ఉత్సాహంలో తప్పటడుగులు పడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. అది ఆయన బాడీ లాంగ్వేజ్ లో చాలా క్లియర్ గా కనపడుతోంది. ఇంతకు ముందులా కాకుండా ప్రతిక్షణం ప్రజలతో కలిసి పోవడానికి ఆయన చూస్తున్నారు. ప్రజలు రాజకీయాల్ని ప్రతీ క్షణం గమనిస్తున్నారు అన్న జాగ్రత్త ఆయనలో కనపడుతోంది. పిల్లలు ఫోటో అడిగితే ఇచ్చేస్తున్నారు.. కలవాలని వచ్చిన సామాన్యులను దగ్గరికి చేర్చుకుంటున్నారు... చుట్టూ ఉండే సెక్యూరిటీ ఆంక్షలు కొంతమేర తగ్గించారు. అన్నింటిని మించి మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు.  2024 టీడీపీ లోనూ.. చంద్రబాబులోనూ తీసుకు వచ్చిన అసలైన మార్పు ఇదే అంటున్నారు చూస్తున్నవాళ్ళు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget