అన్వేషించండి

Shruti Sharma: అలాంటి రొమాన్స్ ఫస్ట్ టైమ్ చేశా - ఒంటి మీద దద్దుర్లు వచ్చాయి: ‘హీరామండి’బ్యూటీ శృతి శర్మ

‘హీరామండి’ వెబ్ సిరీస్ లో రజత్ కౌల్‌ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటిచడంపై నటి శృతి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ లోనే తొలిసారి ఇలాంటి రొమాంటిక్ సీన్లు చేసినట్లు వెల్లడించింది.

Shruti Sharma About Heeramandi Intimate Scenes: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మనీషా కొయిరాలా, సోనాక్షీ సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ కీలక పాత్రలు పోషించారు. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పాకిస్తాన్ లోని వేశ్య గృహాల్లోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా భాగస్వాములు అయ్యారనే కథాశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రస్తుతం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆ సీన్లు చేస్తుంటే ఒంటి మీద దద్దుర్లు వచ్చాయి- శృతి 

‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ బ్యూటీ శృతి శర్మ కీలకపాత్ర పోషించింది. తన నటనకు గాను ప్రశంసలు దక్కించుకుంటోంది. సైమా పాత్రలో ఒదిగిపోయి నటించింది. షాహీ మహల్ వంటశాలలలో పని చేయడంతో పాటు అలామ్‌జేబ్‌కు నమ్మకమైన స్నేహితురాలిగా ఉంటుంది. ఈ సిరీస్ లో సైమా (శ్రుతి శర్మ) ఇక్బాల్ (రజత్ కౌల్)తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బెడ్ సీన్స్‌పై కీలక విషయాలు వెల్లడించింది. ఆ సీన్లు చేసేందుకు చాలా కష్టపడ్డట్లు వెల్లడించింది. “ఈ సిరీస్ లో రజత్ కౌల్ తో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు చేశాను. అందులో ఇద్దరం నేచురల్ గా నటించాం. ఇలాంటి సీన్లు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. ఆ సీన్లు చేస్తున్నప్పుడు నా శరీరం మీద దద్దుర్లు వచ్చాయి. ఒక రోజంతా ఈ సన్నివేశాల కోసం కష్టపడ్డాం. దుమ్ము ధూళి ఉన్నప్పటికీ రొమాంటిక్ సీన్లలో నటించాం. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు షూటింగ్ కొనసాగింది. వెబ్ సిరీస్‌లో ఈ సీన్లు చాలా అద్భుతంగా కనిపించాయి” అని చెప్పుకొచ్చింది.

సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగా ఉన్నా-శృతి

‘హీరామండి: ది డైమండ్ బజార్’ లో తన క్యారెక్టర్ బాగా నచ్చిందని శృతి శర్మ తెలిపింది. ఈ సినిమాలో సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ రాసుకున్న పాత్రకు సరిపోయే వారినే సెలెక్ట్ చేసుకుంటారు. నన్ను పిక్ చేసుకున్నారంటేనే  చాలా గర్వంగా ఫీలయ్యాను. ఆయన ఊహించుకున్న పాత్ర కోసం నా శక్తివంచన లేకుండా కష్టపడ్డాను. ఆయన కూడా తన నటన పట్ల ప్రశంసలు కురిపించారు” అని చెప్పింది.

‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందింది. ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ లో రెడ్ లైట్ ఏరియాలోని మహిళలు దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా పాల్గొన్నారు అనేది ఇందులో చూపించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. శృతి శర్మ తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో పాటు పలు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లలో కనిపించి ఆకట్టుకుంటుంది. 

Read Also: ఆ టాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నా - కానీ, ఆ రూమర్స్‌ అవాస్తవం: శ్రద్ధాదాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget