ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం', పుష్ప 2పై శ్రీవల్లి క్రేజీ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
Kaatera Movie Telugu Version Now Streaming on ZEE5: కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ ‘కాటేరా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. కన్నడలో ‘సలార్’కు పోటీగా విడుదలై 'కాటేరా' ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా బీట్ చేసి మరీ కలెక్షన్స్‌ను సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరిస్తుంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ, ఇంతవరకు దీని తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. అంతేకాదు మూవీ రిలీజ్, స్ట్రీమింగ్‌కి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన,ప్రచారం లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మలయాళ సినిమా చరిత్రలో 2024 మర్చిపోలేని సంవత్సరం. సంవత్సరం మొదలై నాలుగు నెలలు కూడా కాకముందే 10 బ్లాక్‌బస్టర్లను మాలీవుడ్ అందించింది. దీంతో మలయాళం సినిమాలపై అంచనాలు బాగా పెరిగాయి. గతేడాది వచ్చిన ‘రోమాంచం’ కేరళలో మాత్రమే ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌తో ‘రోమాంచం’ డైరెక్టర్ జీతు మాధవన్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా ‘ఆవేశం’పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచాయి. కేరళలోనే కూడా బయట రాష్ట్రాల్లో కూడా ‘ఆవేశం’ కోసం ఆడియన్స్ ఎదురు చూశారు. ఇన్ని అంచనాల మధ్య గత శుక్రవారం ‘ఆవేశం’ విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Rashmika Mandanna About Her Role In ‘Pushpa 2’: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప ది రైజ్’. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Bharateeyudu 2 New Poster Kamal Haasan returns as Senapathy: లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'ఇండియన్ 2'(భారతీయుడు 2). డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జాన్‌లో విడుదల కానుంది. దీనిపై ఇటీవల ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఈ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. ఇక ఎంతోకాలంగా అప్‌డేట్ కోసం చూస్తున్న ఈ మూవీ లవర్స్ అంతా రిలీజ్ అప్‌డేట్ రాగానే ఖుష్ అయ్యారు. ఫైనల్ మూవీ విడుదలపై క్లారిటీ వచ్చిందంటూ సంబరపడ్డారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డట్ వదిలారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Lokesh Kanagaraj Next Movie With Raghava Lawrence: తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా, బ్లాక్ బస్టర్ హిట్స్ తో దుమ్మురేపారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఆయన ఓ ప్రాజెక్ట్ చేపడుతున్నారంటే భారీగా అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్ ను ఏప్రిల్ 22న అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు. ఇంతకీ ఈ సినిమాకు ఏ పేరు పెట్టబోతున్నారా? అని సినీ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)