అన్వేషించండి

Aavesham Review: ఆవేశం రివ్యూ: నేషనల్ అవార్డు లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ - సినిమా ఎలా ఉంది?

Aavesham Telugu Review: ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ యాక్షన్ కాెమెడీ మూవీ ‘ఆవేశం’ ఎలా ఉంది? మలయాళం సినిమా మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుందా? ‘రోమాంచం’ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Aavesham Review in Telugu
సినిమా రివ్యూ: ఆవేశం
రేటింగ్: 3/5
నటీనటులు: ఫహాద్ ఫాజిల్, హిప్జ్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాజ్, సాజిన్ గోపు తదితరులు 
ఛాయాగ్రహణం: సమీర్ తాహిర్
సంగీతం: సుశిన్ శ్యామ్
నిర్మాతలు: నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్
రచన, దర్శకత్వం: జీతు మాధవన్
విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024

మలయాళ సినిమా చరిత్రలో 2024 మర్చిపోలేని సంవత్సరం. సంవత్సరం మొదలై నాలుగు నెలలు కూడా కాకముందే 10 బ్లాక్‌బస్టర్లను మాలీవుడ్ అందించింది. దీంతో మలయాళం సినిమాలపై అంచనాలు బాగా పెరిగాయి. గతేడాది వచ్చిన ‘రోమాంచం’ కేరళలో మాత్రమే ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌తో ‘రోమాంచం’ డైరెక్టర్ జీతు మాధవన్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా ‘ఆవేశం’పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచాయి. కేరళలోనే కూడా బయట రాష్ట్రాల్లో కూడా ‘ఆవేశం’ కోసం ఆడియన్స్ ఎదురు చూశారు. ఇన్ని అంచనాల మధ్య గత శుక్రవారం ‘ఆవేశం’ విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?

కథ: అజు (హిప్జ్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శాంతన్ (రోషన్ షానవాజ్) కేరళ నుంచి ఇంజనీరింగ్ చదవడం కోసం బెంగళూరుకు వస్తారు. అయితే కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువగా ఉంటుంది. సీనియర్లు ఎప్పటి నుంచో కాలేజీలో ఉంటున్నారు కాబట్టి వారిలో ఐకమత్యం ఎక్కువ అని, జూనియర్లు కూడా అలాగే ఉంటే ర్యాగింగ్ ఉండదని అజు జూనియర్లను మోటివేట్ చేస్తాడు. 22 మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి సీనియర్లను లెక్క చేయకుండా ప్రవర్తిస్తాడు. ఒకరోజు వీళ్లు ముగ్గురూ సీనియర్లలో మోస్ట్ డేంజరస్ అయిన కుట్టితో (మిథుట్టీ) వాళ్లకు తెలియకుండానే పెట్టుకుంటారు. దీంతో కుట్టి అదే రోజు రాత్రి పెద్ద గ్యాంగ్‌తో వచ్చి వీళ్లు ముగ్గురినీ బట్టలు ఊడదీయించి సిటీ అంతా కార్లో తిప్పి తమ ప్లేస్‌కు తీసుకువెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వీళ్లని కొడతారు.

ఈ సంఘటనతో అజు ఇగో హర్ట్ అవుతుంది. లోకల్‌గా ఉన్న గూండాలతో కలిసి కుట్టి పని పట్టాలనే తన ఆలోచనను మిగతా ఇద్దరితో చెప్తాడు. దానికి వాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఇక ముగ్గురూ కలిసి లోకల్ రౌడీ కోసం వెతుకుతూ ఉంటారు. వీరికి కర్ణాటకలో పెద్ద రౌడీ అయిన మలయాళీ రంగా (ఫహాద్ ఫాజిల్) పరిచయం అవుతాడు. కొన్ని రోజుల్లోనే వీరు రంగాతో బాగా క్లోజ్ అవుతారు. సీనియర్లు తమను చూడాలంటేనే భయపడాలనే వీరి ప్లాన్ ఏం అయింది? రంగా వీరికి సాయం చేశాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: కథగా చూసుకుంటే ‘ఆవేశం’ చాలా చిన్న లైన్. కాలేజీలో రెండు బ్యాచ్‌ల మధ్య గొడవ, బలహీనంగా ఉన్నవారు ఒక రౌడీ సపోర్ట్ కావాలనుకోవడం... ఇంత చిన్న కథకు దర్శకుడు జీతు మాధవన్ అద్భుతమైన పాత్రలు, స్క్రీన్‌ప్లే రాశాడు. సినిమా కొంచెం స్లోగానే ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్‌లో సగానికి పైగా టైమ్ కాలేజీ గొడవతోనే సరిపోతుంది. అవసరం అయిన దాని కంటే ఎక్కువ టైమ్‌ను ఈ కాలేజీ గొడవలకు ఇచ్చినట్లు అనిపిస్తుంది.

ఎప్పుడు స్క్రీన్ మీద ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడో అక్కడ నుంచి సినిమా పరుగులు పెడుతుంది. స్క్రీన్‌ప్లేను కూడా జీతు మాధవన్ చాలా తెలివిగా రాసుకున్నాడు. సినిమా ప్రారంభం సాధారణంగా ఉన్నప్పటికీ గ్రాఫ్ కిందకి పడకుండా పైకి మాత్రమే వెళ్లేలా చూసుకున్నాడు. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే గూస్‌బంప్స్ స్టఫ్. ఒక కమర్షియల్ సినిమాలో హీరో కంటే ఎక్కువగా తన చుట్టూ ఉండే పాత్రలకు ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వడం దాన్ని హీరో సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. జీతు మాధవన్ విజన్‌కు ఫహాద్ ఫాజిల్ సపోర్ట్ చేయడంతోనే ఈ సినిమా ఆల్‌మోస్ట్ సక్సెస్ అయింది.

ఫస్టాఫ్‌లో ఫన్, యాక్షన్ మీద వెళ్లిపోయిన ‘ఆవేశం’ సెకండాఫ్‌లో కాస్త థ్రిల్లర్ టర్న్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ముగ్గురు స్టూడెంట్స్‌కు ఒక సమస్య ఎదురవుతుందో, దానికి వారు ఎలా స్పందిస్తారు? తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రస్ట్‌ను జీతు మాధవన్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేశాడు. ఏ సినిమాలో అయినా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ అద్భుతంగా ఉండాలన్నది అందరికీ తెలిసిన కచ్చితమైన విషయమే. జీతు మాధవన్ దీన్ని కరెక్ట్‌గా ఫాలో అయ్యాడు. క్లైమ్యాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లో సినిమాకే హైలెట్. ఇక్క ఫహాద్ ఫాజిల్ విశ్వరూపం చూపించేశాడు. సినిమా ఎండింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆడియన్స్ థియేటర్ లోపల నుంచి ఒక మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ మరో హీరో. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. గలాటా, ఇల్యూమినాటి, జాడా ఇలా సాంగ్స్ అన్నీ వినడానికి బాగుంటాయి. వీటి పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ ఫైట్లకి సుశిన్ శ్యామ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని కరెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Also Read: బడే మియా చోటే మియా రివ్యూ: వరదరాజ మన్నార్‌తో బాలీవుడ్ హీరోల ఢీ - ఎలా ఉందంటే?

ఫహాద్ ఫాజిల్‌ను తిరిగి పరిచయం చేస్తున్నామని ప్రచారం సమయం నుంచే మేకర్స్ చెప్తూ వచ్చారు. అది 100 శాతం నిజం. ఇప్పటివరకు మనం చూసిన ఫహాద్ ఫాజిల్‌కు, ‘ఆవేశం’లో కనిపించిన ఫహాద్ ఫాజిల్‌కు చాలా తేడా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇందులో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఫన్, యాక్షన్, ఎమోషనల్ ఇలా తన నటనలో ఉన్న అన్ని రకాల పార్శ్వాలను చూపించే అవకాశం ఫహాద్‌కు దక్కింది. దానికి ఫాఫా 100కు 1000 శాతం న్యాయం చేశాడు. జీతు మాధవన్ ఈ సినిమాను అద్భుతంగా రాశాడు. కానీ ఒక్కసారి ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చాక స్టోరీ, స్క్రీన్‌ప్లే అన్నీ పక్కకి వెళ్లిపోతాయి. రంగా పాత్రలో ఫహాద్ ఫాజిల్ చేసే మ్యాజిక్ మాత్రమే కనిపిస్తుంది. తన యాక్టింగ్‌తో గ్రేట్ రైటింగ్‌ను కూడా ఫహాద్ ఫాజిల్ చాలా ఈజీగా ఓవర్ షాడో చేసేస్తాడు. రంగా పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటనకు నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌కు మరో లుక్‌ను సీక్రెట్‌గా ఉంచారు. ఆ లుక్‌లో ఫహాద్ చాలా యంగ్‌గా కనిపిస్తాడు.

మిగతా నటీనటుల విషయానికి వస్తే... అంబన్ పాత్రలో నటించిన సాజిన్ గోపు గుర్తుండిపోయే స్థాయిలో నటించారు. కాలేజీ స్టూడెంట్స్‌గా నటించిన హిప్జ్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాజ్ ముగ్గరూ కొత్తవాళ్లే అయినా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఆవేశం’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మీకు చుట్టుపక్కల ఉన్న థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుంటే మిస్ అవ్వకుండా చూడండి.

Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget