Lokesh Kanagaraj: రాఘవ లారెన్స్ తో లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా?
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రాఘవ లారెన్స్ హీరోగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు లోకేష్ దర్శకుడిగా కానుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Lokesh Kanagaraj Next Movie With Raghava Lawrence: తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా, బ్లాక్ బస్టర్ హిట్స్ తో దుమ్మురేపారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఆయన ఓ ప్రాజెక్ట్ చేపడుతున్నారంటే భారీగా అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్ ను ఏప్రిల్ 22న అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు. ఇంతకీ ఈ సినిమాకు ఏ పేరు పెట్టబోతున్నారా? అని సినీ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.
రాఘవ లారెన్స్ తో లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ
‘తలైవా 171’ సినిమా పనులు కొనసాగుతుండగానే, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు లోకేష్ కనగరాజ్. తాజాగా మరో సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘బెంజ్’(BENZ) అనే టైటిల్ ఖారారు చేశారు. అయితే, ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదు. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు లాఘవ లారెన్స్ హీరోగా చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాకు బక్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథను కూడా అందిస్తున్నారట.
It is my wish to bring #Benz to the screen and this is catching its own wish at 11:11 🤞🏻
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 14, 2024
I am very happy to be associating with our beloved @offl_Lawrence sir, thank you so much for trusting our team. And Director @bakkiyaraj_k , I am excited for you.
Thank you everyone for… pic.twitter.com/MOVB12Puh4
‘ఖైదీ’ ఫార్ములా రిపీట్ కాబోతుందా?
ఇక ఈ సినిమాకు సంబంధించి క్రేజీ విషయాలు వెల్లడి అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. కార్తీ హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమాలో మాదిరిగానే ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే ఫార్ములాను లారెన్స్ తో రిపీట్ చేయనున్నట్లు సమాచారం. కచ్చితంగా ఈ సినిమా ‘ఖైదీ’ని మించి సక్సెస్ అందుకుంటుందనే ఆశాభావంలో ఉన్నారట లోకేష్.
ఇక లోకేష్ కనగరాజ్ చివరిసారిగా దళపతి విజయ్ తో కలిసి ‘లియో’ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సాధించింది. అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించింది. సుమారు రూ. 600 కోట్లు కలెక్ట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్, సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు. ‘లియో’ క్లైమ్యాక్స్ లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ కూడా ‘లియో 2’ ఉంటుందన్న విషయాన్ని గట్టిగానే చెప్పారు. అయితే, ఈ సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, వరుస ప్రాజెక్టులతో లోకేష్ బిజీ అవుతున్నారు.
Read Also: నేను బాగున్నాను, ఎవరూ టెన్షన్ పడకండి, మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తా: షాయాజీ షిండే