అన్వేషించండి

Sayaji Shinde: నేను బాగున్నాను, ఎవరూ టెన్షన్ పడకండి, మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: షాయాజీ షిండే

గుండె సంబంధ సమస్యతో హాస్పిటల్ లో చేరిన నటుడు షాయాజీ షిండే, తన హెల్త్ గురించి కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

Sayaji Shinde About His Health: ప్రముఖ నటుడు షాయాజీ షిండే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసింది. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా ఆయన తన ఆరోగ్యం గురించి కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఇన్ స్టాలో వీడియో షేర్ చేశారు. 

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన షాయాజీ షిండే

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని షాయాజీ షిండే తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. “అందరికీ నమస్కారం. నటుడిగా నన్ను ఇష్టపడే వారికి, నేను హాస్పిటల్ లో చేరానని తెలుసుకుని నాకోసం ఆందోళన చెందిన వారికి ధన్యవాదాలు. మీ ప్రార్థనలు ఫలించి నేను కోలుకున్నాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను. ప్రేక్షకులను మళ్లీ ఎంటర్ టైన్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు. షాయాజీ షిండే వీడియో పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sayaji Shinde (@sayaji_shinde)

ఈ నెల 11న ఛాతి నొప్పితో హాస్పిటల్ లో చేరిక

ఈ నెల 11న ఛాతీలో నొప్పి రావడంతో ఆయన  ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయను మహారాష్ట్ర సతారాలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను పరిశీలించి.. టెస్టుల అనంతరం గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో యాంజియోప్లాస్టీ చేశారు. “షాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తీసుకురాగానే ఈసీజీ తీశాం. కొన్ని సమస్యలను గుర్తించాం. యాంజియోగ్రామ్ నిర్వహించిన తర్వాత గుండెలో కుడివైపు కొన్ని బ్లాక్స్‌ గుర్తించాం. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించాం’’ అని డాక్టర్లు వెల్లడించారు.    

తెలుగులో పలు సినిమాలు చేసిన షాయాజీ షిండే

షాయాజీ షిండే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మహారాష్ట్రాలో పుట్టి పెరిగిన ఆయన ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. ‘సూరి’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి హీరోగా నటించారు. ఆ తర్వాత ‘ఠాగూర్’లో విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశం దక్కించుకున్న ఆయన  విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. షాయాజీ నటించిన ‘గుడుంబా శంకర్‌’, ఆంధ్రుడు, ‘సూపర్‌’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్‌ శీను’, ‘నేనింతే’, ‘కింగ్‌’, ‘అదుర్స్‌’ సహా పలు సినిమాలు ఆయనకు మంచి క్రేజ్ తెచ్చాయి.

Read Also: సల్మాన్‌ ఇంటి ముందు కలకలం - కాల్పులు జరిపిన దుండగులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget