Rashmika: ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారు, ‘పుష్ప 2’ మూవీపై రష్మిక క్రేజీ కామెంట్స్
Rashmika Mandanna: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Rashmika Mandanna About Her Role In ‘Pushpa 2’: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప ది రైజ్’. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా నడుస్తోంది.
‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ను చూస్తారు: రష్మిక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న ‘పుష్ప 2’ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర చేయడం ఛాలెంజింగ్ తో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. “‘పుష్ప’ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. సినిమా కథ ఏంటి? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? దాన్ని స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు? ఇంతకీ జనాలకు ఏం చూపించబోతున్నారు? అనే అంశాల గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. ఇంకా చెప్పాలంటే ‘పుష్ప’ సినిమాలో నా పాత్ర గురించి అవగాహన లేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. సినిమా కథ ఏంటో తెలుసు. ఎలా నటించాలో కూడా తెలిసిపోయింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ను చూస్తారు” అని రష్మిక వెల్లడించింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘పుష్ప’
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. వసూళ్ల సునామీ సృష్టించింది. అల్లు అర్జున్ మేనరిజం కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో తన నటనకు గాను బున్నీ ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప’ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా ఉన్న ఆయన, ఈ సినిమాలో ఎర్ర చందనం సరఫరా చేసే నాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెకావత్ తో పాటు దాక్షాయణి, మంగళం శీను నుంచి వచ్చే సమస్యలు ఎంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
Wishing the 𝒏𝒂𝒕𝒊𝒐𝒏'𝒔 𝒉𝒆𝒂𝒓𝒕𝒕𝒉𝒓𝒐𝒃 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday 🫰🏻#Pushpa2TheRuleTeaser on April 8th 🔥#PushpaMassJaathara 💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
— Pushpa (@PushpaMovie) April 5, 2024
Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil… pic.twitter.com/AnsbEXZqJT
Read Also: నేను బాగున్నాను, ఎవరూ టెన్షన్ పడకండి, మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తా: షాయాజీ షిండే