Odela 2: తమన్నా బర్త్ డే స్పెషల్... 'ఓదెల 2'లో నాగ సాధువుగా... స్పెషల్ పోస్టర్ వచ్చేసింది
Tamannaah Birthday: నేడు మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు. ఈ స్పెషల్ డే సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న 'ఓదెల 2' నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఆమె హీరోయిన్ గా నటిస్తున్న 'ఓదెల 2' సినిమాలో నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి, తమన్నాకు పుట్టిన రోజు విషెస్ తెలియజేశారు చిత్ర బృందం.
'ఓదెల 2' నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కన్పిస్తోంది. అలాగే ఐటం సాంగ్స్ లో కూడా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ చాలా కాలం తరువాత ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఓదెల 2' అనే సినిమాలో తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది. 2021లో రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకున్న 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్ - సంపత్ నంది టీం వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఓదెల 2' సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. 'కాంతారా' సినిమాతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఓదెల 2' మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై, అందులో తమన్నా పాత్రపై ఆసక్తిని పెంచేశాయి.
ఇందులో తమన్నా నాగ సాధు (శివ శక్తి) పాత్రలో కనిపించబోతోంది. తాజాగా తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ 'ఓదెల 2' మేకర్స్ సరికొత్త అవతార్లో తమన్నా ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో తమన్నా చుట్టూ పుర్రెలు ఉండగా, వాటి మధ్య ఆమె ధైర్యంగా నడుస్తూ కనిపించింది. ఇక పైన రాబందులు ఎగురుతుండడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావడం ఖాయం. ఈ సినిమాలో తమన్నా పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. దీనికోసం ఆమె ఇప్పటికే కఠినమైన శిక్షణను కూడా తీసుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమన్నా ఇందులో అదిరిపోయే స్టంట్లు చేయబోతునట్టు తెలుస్తోంది. మంచి, చెడుల మధ్య ఘర్షణ ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. అక్టోబర్లో ఈ సినిమాకు చెందిన చివరి షెడ్యూల్ షూటింగ్ ఓదెల విలేజ్ లో జరిగింది. ఓదెల మల్లన్న ఆలయంలోనే ఈ సినిమా షూటింగ్ జరగడం మరో విశేషం. త్వరలోనే మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read: 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
To the warrior… who is SHIVA n SHAKTI both embodied into one,
— Sampath Nandi (@IamSampathNandi) December 21, 2024
Happy Birthday dear @tamannaaahspeaks 🌟✨
May the divine force be wid you, always 🙏🏾✌🏽#Odela2@ashokalle2020 @ihebahp @ImSimhaa @AJANEESHB @soundar16 @Neeta_lulla @SampathNandi_TW @creations_madhu #DiMadhu pic.twitter.com/C8ofHgKiyY
ప్రియుడితో పెళ్లి
ఇదిలా ఉండగా తమన్నా వచ్చే ఏడాది పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించి చాలా కాలం అవుతోంది. అయితే ఆ తరువాత అటు తమన్నా, ఇటు విజయ్ ఎవరికివారు సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటిదాకా వీరిద్దరూ ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ కొత్త సంవత్సరం తమన్నా - విజయ్ జంట అభిమానులకు పెళ్ళికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ జంట పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
Also Read: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?