UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
UI Movie Leaked Online : ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూఐ' మూవీ HD పైరసీ వెర్షన్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది.
కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా మూవీ 'యూఐ'. డిసెంబర్ 20న కన్నడ, తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. చాలా రోజుల తరువాత ఉపేంద్ర నుంచి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ని థియేటర్లలో చూసి, ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అయితే తాజాగా ఉపేంద్రకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 'యూఐ' మూవీ పైరసీ కావడమే ఆ షాకింగ్ న్యూస్.
కొన్ని గంటల్లోనే 'యూఐ' లీక్
'యూఐ' సినిమాలో ఉపేంద్రతో పాటు మురళీ శర్మ, నిధి సుబ్బయ్య తదితరులు నటించారు. థియేటర్లలో విడుదలైన కొద్ది క్షణాలకే అనేక పైరసీ వెబ్‌సైట్‌లలో 'యూఐ' మూవీ ఆన్‌లైన్‌లో లీక్ కావడం గమనార్హం. Movierulez, Tamilrockerz, Filmyzilla, కొన్ని టెలిగ్రామ్ ఛానెల్ లతో సహా... మూవీస్డా, తమిళ్‌బ్లాస్టర్స్, తమిళ యోగి, ఐబొమ్మ వెబ్‌సైట్‌లలో ఈ చిత్రం పైరసీ వెర్షన్ ఉచితంగా డౌన్లోడ్ కు అందుబాటులో ఉండడం నిర్మాతలను టెన్షన్ పెట్టే విషయం. 'యూఐ' ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే 'యూఐ' మూవీ వైవిధ్యంగా ఉంది అనే టాక్ తో థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది ఈ మూవీ.
పదేళ్ల తర్వాత...
ఉపేంద్ర కు సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడిగా ఆయనకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో, దర్శకుడిగా అంతకు రెండింతలు ఎక్కువగానే అభిమానులు ఉంటారు. దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన దర్శకత్వంలో 'యూఐ' సినిమా వచ్చింది. ఎప్పటిలాగే తనదైన శైలిలో ఈ కథలో ఉపేంద్ర కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ బిగ్గెస్ట్ పొలిటికల్ సెటైర్ వేశారు ఉపేంద్ర. కాకపోతే ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చేసిండాలి అన్నట్టుగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణ ప్రేక్షకుడికి అసలు సినిమా అర్థం అవుతుందా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అర్థమైన వాళ్ళు మాత్రం మూవీ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా స్క్రీన్ మీద 'యూఐ' సినిమా ద్వారా ఉపేంద్ర ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడని అంటున్నారు.
Also Read: 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
'యూఐ' కథ ఏంటంటే...
ఒక జేబుదొంగ ఏకంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. అయితే ఆ రాజకీయ నాయకుడి దగ్గర బానిసలుగా బతుకుతున్న ప్రజల్లో అవగాహన పెంచి, కులమతాలకు అతీతంగా ఒక కొత్త సమాజాన్ని స్థాపించడానికి హీరో సత్యతో పాటు అతని తండ్రి శాస్త్రి కూడా ప్రయత్నాలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హీరో సత్య కలియుగ భగవంతుడు అని అతని తండ్రి ప్రకటిస్తారు. అలాంటి సత్యం రాజకీయ నాయకుడు వామనరావును సెంట్రల్ సామ్రాట్ చేస్తానని చెప్తాడు. మరి కల్కిగా వచ్చింది నిజంగా సత్యేనా? సమ సమాజ స్థాపన కోసం తపన పడుతున్న సత్య వామనరావును సెంట్రల్ సామ్రాట్ గా చేస్తానని ఎందుకు చెప్పాడు? అసలు ఈ కల్కి, సత్య ఎవరు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?