అన్వేషించండి

Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే

Rewind 2024: సెలబ్రిటీ కపుల్స్ పెళ్లిళ్లు, డైవోర్స్ మేటర్స్ కామన్ మ్యాన్ కి హాట్ టాపిక్కే. అయితే, తమ లాంగ్ రిలేషన్ కు బైబై చెప్పేసుకుంటున్న సెలబ్రిటీల కహానీలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

నిన్న మొన్న పెళ్లి చేసుకున్నవాళ్లు విడిపోతే... సర్లే లేని లైట్ తీసుకోవచ్చు. కానీ లాంగ్ రిలేషన్ షిప్ నుంచి క్విట్ అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అదీ వాళ్లల్లో  సెలబ్రిటీలుంటే... కామన్ మ్యాన్ లో డిస్కషన్ మొదలవుతుంది. సొసైటీ పై ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది.

ఏఆర్ రెహమాన్... సైరా బాను... అసలు
ఎవరూ ఊహించని
షాకింగ్ న్యూస్ ఇది

నవంబర్ 19వ తేదీ సాయంత్రం చెన్నైకు చెందిన వందనే అనే అడ్వకేట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, అతని సైరా బాను విడిపోతున్నారనేది అందులోని సారాంశం. సోషల్ మీడియా వేడెక్కింది. అసలు నిజమా కాదా అని సందేహపడ్డారు కూడా. కానీ అది నిజమే తేలింది. సాధారణంగా ఏఆర్ రెహ్మాన్ తన వర్క్ ను మాత్రమే  ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రపంచంలో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు రెహ్మాన్. ఉరుము లేని పిడుగు లాంటి ఈ వార్త చూసి రెహ్మాన్ ఫ్యాన్స్ తో సినీ అభిమానులూ షాక్ తిన్నారు. మర్నాడు ఏఆర్ రెహ్మాన్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి, మా ప్రైవసీని గౌరవించండని అందర్నీ కోరారు.  29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట విడిపోవడం అనేది చాలా మందికి మింగుడు పడని అంశం. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ బంధానికి బ్రేకప్ చెప్పామని ఇద్దరూ ప్రకటించారు. రెహ్మాన్ విడాకుల ప్రకటన తర్వాత గంటల వ్యవధిలో ఆయన టీమ్ మెంబర్ మోహిని కూడా తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఇక, రెహ్మాన్, మోహినీల మధ్య ఏదో ఉందని కొంత మంది గీత దాటేశారు. రెహ్మాన్ భార్యతో పాటు ఆయన ముగ్గురు పిల్లలూ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇలాంటి వార్తలు వ్యాప్తి చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దాంతో అంతా సైలెంట్ అయ్యారు.

తమిళ హీరో జయం రవి... ఆర్తి...
వీరిద్దరకీ రాజీ కుదురుతుందా మరి?

పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తెలుగు వారికి బాగా చేరువయ్యారు తమిళ హీరో ‘జయం’ రవి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ తమిళ నటుడు వైవాహిక బంధంపై రూమర్స్ మొదలయ్యాయి. భార్య ఆర్తితో ఆయనకు అంతగా పొసగడం లేదన్న వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ, ‘జయం’ రవి  సెప్టెంబర్ లో విడాకుల విషయాన్ని ప్రకటించారు. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ‘జయం’ రవి. ఫ్యాన్స్ మాత్రమే కాదు  ఆయన సతీమణి ఆర్తి కూడా షాక్  అయ్యారు. రెండు రోజుల తర్వాత ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే, తనను సంప్రదించకుండానే ఈ విడాకుల విషయాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచారన్నది భార్య ఆర్తి వాదన. ఈ కారణంగా తన పిల్లలు, కుటుంబసభ్యులు ఎంతో మనోస్తాపానికి గురయ్యారని ఆర్తి ఆవేదన చెందారు. ఈ విడాకుల వ్యవహారం కోర్టు మెట్లక్కింది. గత నెలలో, ఈ వ్యవహారంలో ఇద్దరి వాదనలు విన్న కోర్టు, ఇద్దరూ రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని తీర్పునిచ్చింది. ఈ ఇద్దరికీ పెళ్లై ఇప్పటికీ 18 ఏళ్లు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జయం రవికీ, ఓ గాయనికీ సంబంధం ఉందనీ అందుకే భార్యకు విడాకులు ఇచ్చారన్న వార్తలూ గుప్పుమన్నాయి. అయితే, అవన్నీ వట్టి కట్టుకథలే అని రవి కొట్టి పారేశారు.

ధనుష్... రజనీ కుమార్తె...
అలా ఫుల్ స్టాప్ పడింది
!

నయనతార డాక్యుమెంటరీ విషయమై హీరో ధనుష్ కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ధనుష్ విడాకుల న్యూస్ కూడా హైలైట్ అయింది. 2022లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కారణాలు చెప్పలేదు. 18 ఏళ్ల వివాహ బంధానికి వీళ్లు బ్రేకప్ చెప్పడం అప్పట్లో సంచలనమైంది. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. తండ్రి రజనీకాంత్ ఎంటరై వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారనే వార్తలూ షికార్లు చేశాయి. అయితే, అవన్నీ వట్టి గాసిప్స్ మాత్రమే అని తేలింది. చెన్నైలోని  ఫ్యామిలీ కోర్టు అధికారికంగా ఈ ఏడాది వారికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల కోసం వారి నిరీక్షణకు రెండేళ్ల తర్వాత బ్రేక్ పడింది.

Also Read: ఈ ఏడాది ఓటీటీలో సందడి చేయనున్న బాలీవుడ్ క్రేజీ సినిమాలు, మోస్ట్ అవైటింగ్ సిరీస్‌లు ఇవే

మేనమామతో పాటు అల్లుడూ...
జీవీ విడాకులకు హీరోయిన్ కారణమా?

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు మేనల్లుడు అవుతారు జీవీ ప్రకాశ్ కుమార్. స్కూల్ డేస్ నుంచి జీవీ ప్రకాశ్ కుమార్ కి భార్య సైంధవి తో పరిచయం ఉంది. ఆమె గాయని కూడా. ఇద్దరూ కలిసి బోల్డెన్ని మ్యూజిక్ షోలు చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. సైంధవి తమిళ, తెలుగు భాషల్లో మంచి గాయని గా నిరూపించుకున్నారు. ఇద్దరికీ ఓ పాప కూడా. 11 ఏళ్ల రిలేషన్ షిప్ కు వీరు కూడా టాటా చెప్పేశారు. కారణాలు తెలియవు. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్న కారణంగానే ఈ వైవాహిక బంధానికి  బ్రేక్ పడిందని కోలీవుడ్ లో టాక్. సైంధవి మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేశారు.

Also Readబాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget