అన్వేషించండి

Bollywood Rewind 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే

Bollywood Actors - Lookback 2024: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు... అందరూ గడిచిపోయిన సంవత్సరంలోని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. 2024లో నిరాశ పరిచిన బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరంటే...

Bollywood Highlights 2024: ఏడాది (2024) ముగింపునకు చేరుకుంది. ఈ సమయంలో రాబోయే 2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటూనే... అసలు 2024లో ఏమేం చేశాం అని అంతా ఆలోచన చేస్తుంటారు. 2024లో ఈ పని చేశాం.. 2025లో ఇలా ప్లాన్ చేసుకోవాలి అంటూ.. ముందుగానే కొన్ని రెజిల్యూషన్స్ అనుకుంటూ ఉంటారు. వారనుకున్న రెజిల్యూషన్స్ చేయడం, చేయకపోవడం సంగతి పక్కన పెడితే.. కొత్త సంవత్సరం వస్తుందంటే కామన్‌గా అందరూ చేసే పని ఇదే. ఇక సినిమాల సంగతికి వస్తే... అంతా 2024లో ఏం జరిగింది అంటూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లి వస్తారు. ఈ సంవత్సరం వీళ్లు హిట్లు కొట్టారు... భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాలు నిరాశ పరిచాయి అంటూ వెళ్లిపోతున్న సంవత్సరం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఇప్పుడిక్కడ చెప్పుకునే విషయం ఏమిటంటే... 2024 సంవత్సరం బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయకుండా, అభిమానులను నిరాశ పరిచిన స్టార్ హీరోలు ఎవరనేది? ఈ లిస్ట్‌లో బడా స్టార్సే ఉన్నారు. వారెవరెవరూ అంటే.. 

షారూఖ్ ఖాన్... 2023లో రెండు వచ్చాయి కానీ!  
షారూఖ్ ఖాన్... బాలీవుడ్‌లో అతి పెద్ద స్టార్ హీరో. బాలీవుడ్ నేమ్ రోజురోజుకూ డౌన్ అవుతున్న సమయంలో 2023లో ‘పఠాన్’తో ప్రాణం పోసి, ‘జవాన్’‌తో జీవం ఇచ్చాడు షారుఖ్. ఈ రెండు సినిమాలతో మరోసారి తను ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అని నిరూపించుకున్నాడు. అదే సంవత్సరం ‘డంకీ’తో వచ్చి కాస్త డిజప్పాయింట్ చేసినా... కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబట్టాడు. అలాగే మరో సినిమాలో గెస్ట్‌గా కనిపించాడు. ‘టైగర్ 3’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచిన షారుఖ్ నుండి 2024లో మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. వాస్తవానికి 2024లో ‘కింగ్’ అనే సినిమాతో ఆయన రావాల్సి ఉంది. ఆ సినిమా పరిస్థితి ఏంటనేది ఇంత వరకు తెలియరాలేదు. బహుశా 2025లో ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయి.  

సల్మాన్ ఖాన్... ‘సింగం ఎగైన్’లో అతిథిగా తప్పిస్తే!
ఖాన్ త్రయంలో రెండవ ఖాన్ సల్మాన్ ఖాన్. ఆయన నుండి కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయి చిత్రం రాలేదు. 2023లో ‘టైగర్ 3’ సినిమాతో వచ్చిన సల్మాన్... 2024లో మాత్రం ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. అయితే ‘సింగం ఎగైన్’ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించిన సల్మాన్... డిసెంబర్ 25న రాబోయే ‘బేబీ జాన్’ సినిమాలోనూ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఆ లెక్కన కేవలం 2024లో ఆయన గెస్ట్ పాత్రలలోనే దర్శనమిచ్చినట్లు అవుతుంది. కానీ, 2025లో మాత్రం ఆయన ఫ్యాన్స్‌ని నిరాశపరచడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘సికిందర్’ 2025లో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు.

అమీర్ ఖాన్... రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలే!

మిస్టర్ పర్ఫెక్ట్, ఖాన్ త్రయంలో మూడవ వాడైన అమీర్ ఖాన్ నుండి ఈ సంవత్సమే కాదు... 2023లోనూ ఆయన నుండి సినిమా రాలేదు. చివరిగా ఆయన నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. 2022లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా తర్వాత అమీర్ ఖాన్ దాదాపు 2 సంవత్సరాల పాటు గ్యాప్ ఇచ్చారు. 2023లో ఆయన ప్రకటించిన ‘సితారే జమీన్ పర్’ అనే సినిమా అప్డేట్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. బహుశా ఈ మూవీ 2025లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో అమీర్ ఖాన్ కనిపించనున్నారనేలా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కాబట్టి... రెండు సంవత్సరాలుగా మిస్సవుతున్న ఈ ఖాన్.. అభిమానులకు 2025లో మాత్రం కచ్చితంగా థియేటర్లలో దర్శనమిస్తాడు. 

ఆయుష్మాన్ ఖురానా... ఎందుకో గ్యాప్ వచ్చేసింది!
బాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్స్‌లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందీ అంటే... మ్యాగ్జిమమ్ అందులో కంటెంట్ ఉంటుందనేలా నేమ్‌‌ని సొంతం చేసుకున్నాడు. ఆయన చేసిన సినిమాలతో ఎన్నో సార్లు విమర్శకుల ప్రశంసలు సైతం ఈ హీరో అందుకున్నాడు. అటువంటి ఈ హీరో నుండి 2024లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆయన చివరిగా ‘డ్రీమ్ గాళ్ 2’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అవి 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. వాటి అప్డేట్ ఏమిటనేది మేకర్స్ చెప్పాల్సి ఉంది.

Also Readదటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్

రణబీర్ కపూర్... యానిమల్ సక్సెస్ తర్వాత!
డిసెంబర్‌ 2023లో వచ్చిన ‘యానిమల్’ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ అందుకుని, ఖాన్‌లను కూడా కంగుతినిపించిన స్టార్ రణబీర్ కపూర్. ఆ సినిమా తర్వాత అంటే 2024లో రణబీర్ నుండి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘రామాయణ్ 1’, ‘లవ్ అండ్ వార్’ సినిమాలు రెండూ కూడా 2026లో రిలీజ్‌‌కు షెడ్యూల్ చేయబడ్డాయి. అంటే రాబోయే 2025లో కూడా రణబీర్ కపూర్ సినిమా ఉండే అవకాశాలు లేవన్నమాట. చూద్దాం మరి ఈ స్టార్ ఏదైనా గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చైనా 2025లో కనిపిస్తాడేమో.

మొత్తంగా అయితే ఈ ఐదుగురు స్టార్స్ 2024లో తమ అభిమానులను బాగా నిరాశ పరిచారు. ముఖ్యంగా ఖాన్ త్రయం‌లో ఏ ఒక్క ఖాన్ నుండి కూడా సినిమా ఈ 2024లో లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. రణబీర్ కపూర్ 2026కి ఫిక్సయ్యాడు కాబట్టి.. మిగతా స్టార్స్ తమ అభిమానులను డిజప్పాయింట్ చేయకుండా 2025లో సినిమాలతో అలరిస్తారని ఆశిద్దాం.

Also Read: Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget