అన్వేషించండి

Google Most Searched Celebs 2024: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్

Google's Top 10 most searched actors of 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా గూగుల్ లో సెర్చ్ చేసిన అంతర్జాతీయ లిస్టులో, చోటు దక్కించుకున్న ఏకైక టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024లో గూగుల్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు ఉండడం విశేషం. ఈ లిస్టులో ఆయన రెండవ స్థానంలో ఉండగా, టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ కావడం మరో సంచలనం. 

2024లో గూగుల్ సెర్చ్ డేటా ప్రకారం జనాలు ఎక్కువగా వెతికిన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల పేర్లను తాజాగా గూగుల్ రిలీజ్ చేసింది. అందులో కమెడియన్, పాడ కాస్టర్ కాట్ విలియమ్స్ ను ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసారు. దీంతో ఈ లిస్టులో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడం మెగా అభిమానుల్లో జోష్ నింపేసింది. ఓవైపు రాజకీయాలు, మరోవైపు నటుడిగా బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఈ ఏడాది మరింతగా పెరిగింది. 

నిజానికి పవన్ కళ్యాణ్ తెరపై కన్పించి చాలా కాలమే అవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతేకాకుండా 2024లో సినిమాలు, రాజకీయాల వల్ల ఎంతోమంది ప్రముఖులు వార్తల్లో నిలిచారు. అయినప్పటికీ వాళ్ళందరినీ పక్కకు నెట్టి పవన్ ఈ లిస్ట్ లో ఉండడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. 2024లో గూగుల్ లో  అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ లో కేవలం ముగ్గురు ఇండియన్ స్టార్స్ మాత్రమే స్థానాన్ని దక్కించుకున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉండడం మామూలు విషయం కాదు. ఇక మరో ఇద్దరి విషయానికి వస్తే... హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీలు. 

ఇండియన్ నటి హీనా ఖాన్ ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నారు. ఆమె స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో తన పోరాటం గురించి ధైర్యంగా వెల్లడించి వార్తల్లో నిలిచింది. ఇక నిమ్రత్ కౌర్ ఈ లిస్టులో 8వ స్థానంలో నిలిచింది. 

2024లో ప్రపంచవ్యాప్తంగా Googleలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సెలబ్రిటీల లిస్ట్
1. కాట్ విలియమ్స్
2. పవన్ కళ్యాణ్
3. ఆడమ్ బ్రాడీ
4. ఎల్లా పూర్నెల్
5. హీనా ఖాన్
6. కీరన్ కల్కిన్ టెరెన్స్
7. హోవార్డ్
8. నిమ్రత్ కౌర్
9. సుట్టన్ ఫోస్టర్
10. బ్రిగ్గిట్ బోజో

Also Readవెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!

గూగుల్ డేటా ప్రకారం 2024లో ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యధికంగా సర్చ్ చేసిన  సినిమాల లిస్ట్ లో ఇన్సైడ్ అవుట్ 2, డెడ్ పూల్ అండ్ వోల్వరిన్, సాల్ట్ బర్న్, బీటీల్ జ్యూస్, డ్యూన్ పార్ట్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. ఇండియాలో స్త్రీ 2, కల్కి 2898 ఏడీ, లపాతా లేడీస్ అత్యధికంగా సర్చ్ చేసిన సినిమాలుగా నిలిచాయి. అలాగే 2024 లో 'హీరామండి' వెబ్ సిరీస్ భారతదేశంలో అత్యధికంగా సర్చ్ చేసిన వెబ్ సిరీస్ గా అగ్రస్థానంలో ఉంది.

Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP DesamRR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Vaishnavi Chaitanya: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో అన్యమత ప్రచారం కలకలం, ఆలయాలపై అన్యమతాల గుర్తులు, రాతలు
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో అన్యమత ప్రచారం కలకలం, ఆలయాలపై అన్యమతాల గుర్తులు, రాతలు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.