Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Who Is Vinay Maheshwari? వినయ్ మహేశ్వరి... మంచు ఫ్యామిలీ గొడవలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు. అసలు అతను ఎవరు? మంచు ఫ్యామిలీకి, అతనికి సంబంధం ఏంటి? అంటే...
Manchu Family Fight: మంచు కుటుంబంలో గొడవ వీధికి ఎక్కింది. తనకు తనయుడు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహని ఉందని తండ్రి మోహన్ బాబు (Mohan Babu) కంప్లైయింట్ ఇవ్వగా... గుర్తు తెలియని వ్యక్తులూ అంటూ మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ ఒక లేఖ రాశారు. అందులో వినయ్ మహేశ్వరి పేరు ఉంది. అసలు ఈ గొడవ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి వినయ్ పేరు వినపడుతోంది. ఇంతకీ వినయ్ మహేశ్వరి ఎవరు? ఆయనకు, మంచు కుటుంబానికి సంబంధం ఏమిటి?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్!
వినయ్ మహేశ్వరి... ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. మనోజ్ తన లేఖలో అతని మీద ఆరోపణలు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు, అక్కడ వ్యాపారాలు చేసే స్థానికులకు తాను మద్దతు ఇచ్చిన తర్వాత విష్ణు, వినయ్ మహేశ్వరీ తనపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని మనోజ్ అంటున్నారు. వాళ్ళిద్దరూ చేస్తున్న ఆర్థిక అవకతవకల సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, సంబంధిత అధికారుల ముందు వాటిని బయట పెడతానని మనోజ్ చెబుతున్నారు.
వినయ్ మహేశ్వరి ఇంతకు ముందు ఏం చేశారు?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి చేపట్టడానికి ముందు సాక్షి మీడియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా వినయ్ మహేశ్వరి విధులు నిర్వహించారు. అదే విధంగా హిందీ న్యూస్ పేపర్ దైనిక్ భాస్కర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డులోను ఆయన మెంబరుగా చేశారు. మంచు కుటుంబానికి చెందిన న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల సీఈవోగా ఆ రెండిటికీ సంబంధించిన వ్యవహారాలు కూడా వినయ్ చూస్తున్నారు.
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
సాక్షి మీడియా సంస్థ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విష్ణు భార్య వెరోనికా రెడ్డికి జగన్ అన్నయ్య అవుతారు. అందువల్ల భార్య తరపు వ్యక్తులను మంచు ఫ్యామిలీ విద్యాసంస్థల్లోకి విష్ణు తీసుకు వచ్చారని అభిప్రాయం ప్రజల్లోకి వెళుతోంది.
విష్ణు, మనోజ్ మధ్య వారధిగా వినయ్ మహేశ్వరి?
మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య కొన్ని రోజులగా మాటలు లేవని కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. తమ్ముడికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినయ్ మహేశ్వరి ద్వారా విష్ణు తెలియజేస్తారని టాక్.
విష్ణు దగ్గరకు వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలు అయ్యాయని మనోజ్ సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మంచు ఇంటిలో తాజాగా జరిగిన ఆస్తుల గొడవలో సైతం వినయ్ మహేశ్వర్ మీద మనోజ్ చేయి చేసుకున్నారని, ఆ తర్వాత జరిగిన తోపులాటలో మనోజ్ మంచుకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత మనోజ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన లేఖలో వినయ్ మహేశ్వరి వార్తల్లోకి వచ్చారు. ఆయన విష్ణు మద్దతుదారుడు అని తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?