Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Manchu: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకూ పోలీసు ఎదుట హాజరు కానవవసరం లేకుండా మినహాయింపు ఇచ్చింది.
Mohan Babu got relief in Telangana High Court: తమ ఎదుట హాజరుకావాలన్న పోలీసుల నోటీసుల్ని మోహన్ బాబు హైకోర్టులో సవాల్ చేసి రిలీఫ్ తెచ్చుకున్నారు. నోటీసుల్ని రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జర్నలిస్టులకు మోహన్ బాబు ఇంట్లో ఏం పని అని ప్రశ్నించింది. వాదోపవాదాల తర్వతా డిసెంబర్ 24 వరకు మోహన్ బాబు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు నుంచి మినహాయింపు ఇస్తూ.. విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది.
కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు
ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కంటి కింద స్వల్ప గాయం అయిందని హై బీపీతో బాధపడుతున్నారని అబ్జర్వేషన్ లో ఉంచామని వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. నోటీసులు అందుకున్న వారిలో మంచు విష్ణు, మనోజ్ కూడా ఉన్నారు. మనోజ్ సీపీ కార్యాలయంలో హాజరయ్యి.. శాంతిభద్రతల సమస్య సృష్టించబోనని లక్ష రూపాయలకు బాండ్ సమర్పించారు. మంచు విష్ణు నోటీసులు తనకు ఉదయమే అందాయని అయితే పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం తనకు లేదన్నారు. కానీ వ్యవస్థలను గౌరవించి హాజరవుతానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన కూడా హాజరు కాలేదు.
Also Read: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
పోలీసుల ఎదుట మంచు మనోజ్ హాజరు - విష్ణు డుమ్మా
మరో వైపు హైకోర్టులో రీలీఫ్ మోహన్ బాబు ఒక్కరికే లభించింది. విష్ణుకు లభిచంలేదు.దాంతో ఆయన కూడా పోలీసుల ఎదుట హాజరై బాండ్ సమర్పించే అవకాశం ఉంది. మంచు మోహన్ బాబు నివాసంలోకి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా కేసులు పెట్టారు. అయితే జర్నలిస్టులు ప్రైవేటు వ్యక్తుల నివాసంలో దురుద్దేశపూర్వకంగా చొచ్చుకు వచ్చారని హైకోర్టులో బలంగా వాదించడంతో ఆయనకు రిలీఫ్ దక్కినట్లయింది.
ఆదివారం నుంచి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ డ్రామా
మంచు మనోజ్ ఆదివారం డయల్ 100కు ఫోన్ చేసిన ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేసినప్పటి నుచి వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఫోన్ వచ్చిన తర్వాత పోలీసులు స్పాట్ కు వెళ్లినప్పుడు అంతా హ్యాపీసేనని చెప్పి పంపేశారు. అయితే తర్వాత వారు బౌన్సర్లను రంగంలోకి దించడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. చివరికి మనోజ్ ను ఇంటి నుంచి గెంటి వేయడం వరకూ జరగడంతో ఈ ఎపిసోడ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తి సామాన్యుల్లోనూ వ్యక్తమవుతోంది.