Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Road Accident In Telugu States: నల్గొండ , సత్యసాయి జిల్లాల్లో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని మాధాఫూర్‌లోని ఓ ఐటీ బిల్డింగ్‌లో అగ్ని కీలలు ఎగసి పడ్డాయి.
నల్గొండ జిల్లా, సత్య సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దైవదర్శానికి వచ్చిన ఏడుగురి బతుకులు తెల్లారిపోయాయి. రెండు వేర్వేరు ప్రమాదాలల్లో పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సత్యసాయి జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు భక్తులు. మరికొద్ది నిమిషాలలో తమ గ్రామానికి చేరుకుంటారు అనుకున్న సమయంలో మృత్యువు వెంటాడింది. తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దర్శనం అనంతరం వారు తిరుగు పయాణమయ్యారు. ఈరోజు వేకువ జామున ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.
ప్రమాదంలో స్పాట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరందరూ గుడిబండ మండలం కుమ్మరి నాగేపల్లి గ్రామానికి చెందిన వారీగా గుర్తించినట్లు తెలుస్తోంది. వేకువజామున పొగ మంచు ఎక్కువగా ఉండడంతో దారి సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. స్పృహలో ఉన్న ప్రయాణికులు ఈ విషయాన్ని చెబుతున్నారు.
యాత్రికులు వారి పూర్తి వివరాలు :
1.కేంపన్న
2.కేంచమ్మ
3. ప్రేమ్ కుమార్
4. అతర్వా..
5. గీత లక్ష్మి
6. సుజాతమ్మ
7. గిరిజమ్మ.
8. నాగమణి.
9.ఉష.
10. అమాజఅమ్మ
11. శ్రీదేవి
12. శ్వేత..
13. డ్రైవర్..
*మృతి చెందినవారు :
1 ప్రేమ్ కుమార్.(30)
2.అతర్వా (2)
3.మనోజ్
4 రత్నమ్మ
దేవరకొండలో ఘోర ప్రమాదం
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎర్రారం గ్రామస్తులు దేవరకొండలోని ఓ దర్గాకు వెళ్లారు. అక్కడ వారంతా కర్చొని ఉన్నటైంలో మృత్యువు రూపంలో ఓ డీసీఎం వచ్చి ఢీ కొట్టింది. అదుపు తప్పిన డీసీఎం వారిని దూసుకెళ్లడంతో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరు హాయపడ్డారు. ప్రమాదం జరిగిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
మాధాపూర్‌లో అగ్ని ప్రమాదం పరుగులెత్తిన ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిం. ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఐటీసీ హోటల్ సమీపంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనాన్ని ఈ మధ్యే ప్రారంభించారు. ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. మంటలు చెలరేగడంతో ఆ బిల్డింగ్‌లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా పరుగులు తీశారు. మంటల వల్ల కొందరు ఉద్యోగులకు గాయాలలు అయినట్టు తెలుస్తోంది.