చదివింది ఏడో తరగతే... సంపాదించింది వందల కోట్లు... ఒకప్పుడు రోడ్లపై పెన్నులు అమ్మిన కామెడీ కింగ్ ఎవరో తెలుసా?
తెలుగు రాష్ట్రాలలో, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన ఒక స్టార్ కమెడియన్ హిందీ చిత్రసీమను ఏలాడు. ఒకప్పుడు పెన్నులు అమ్ముకున్న ఈ నటుడు ఇప్పుడు స్టార్ కమెడియన్. ఇంతకీ, ఆయన ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమా చరిత్రలో అగ్ర హాస్య నటులలో ఒకరైన కామెడీ కింగ్ ఏడవ తరగతి వరకే చదువుకున్నాడు. కటిక పేదరికం వల్ల అంతకు మించి చదవలేకపోయిన ఈ కమెడియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. 350కి పైగా సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ ప్రస్తుతం వందల కోట్లకు అంతే కాకుండా స్వతహాగా తెలుగు వాడైన ఆయన హిందీ చిత్ర సీమను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. తెలుగువాడే అయినా ఇండస్ట్రీని ఏలింది మాత్రం హిందీలో. ఆ స్టార్ కమెడియన్ మరెవరో కాదు జానీ లివర్.
ఏడవ తరగతి వరకే చదువు...
కామెడీ కింగ్ జానీ లివర్ 1957 ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి హిందుస్థాన్ యూనిలీవర్ ప్లాంట్ లో ఆపరేటర్ గా పని చేసేవారు. క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన జానీ లివర్ కు ముగ్గురు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. కుటుంబంలో జానీ పెద్దవాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఈ కామెడీ కింగ్ అప్పట్లో ఏడవ తరగతితో చదవడం ఆపేయాల్సి వచ్చింది. ఆ ఏడవ తరగతి వరకు కూడా ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఇంగ్లీష్ హైస్కూల్ లో చదువుకున్నాడు. మాతృభాష తెలుగే అయినప్పటికీ జానీ లివర్ ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, మరాఠీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలడు.
చిన్నతనంలోనే స్కూలు వదిలేసిన జానీ లివర్ అప్పట్లో కుటుంబ పోషణ కోసం ముంబై వీధుల్లో పెన్నులు అమ్ముకునేవాడు. అయితే ఆ టైంలో హిందీ స్టార్స్ సాంగ్స్ కి డాన్స్ చేయడం, వాళ్ళలా యాక్ట్ చేయడానికి ట్రై చేయడం చేసేవాడు. అలాగే కొంతకాలం పాటు జానీ లివర్ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో పని కూడా చేశాడు. అయితే అప్పట్లో అక్కడ జరిగిన ఓ ఫంక్షన్ లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ సీనియర్ అధికారులను ఇమిటేట్ చేసి మెప్పించాడు. దీంతో అప్పటి నుంచి అక్కడున్న కార్మికులంతా ఆయనను జానీ లివర్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో చిత్ర పరిశ్రమలో కాలు పెట్టిన తర్వాత ఆయన తన పేరును జానీ లివర్ గా మార్చుకున్నారు. జానీ లివర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనమల.
ఇండియాలోనే ఫస్ట్ స్టాండ్ అప్ కమెడియన్
జానీ లివర్ ఇండియాలోని మొట్టమొదటి స్టాండ్ అప్ కమెడియన్లలో ఒకరు. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ను మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా స్టేజ్ షోలు చేసి బాలీవుడ్ కళ్ళల్లో పడ్డాడు. దీంతో ఓ కార్యక్రమంలో నటుడు సునీల్ దత్ ఓ షోలో జానీ లివర్ ను చూసి ఇంప్రెస్ అయ్యి, 'దర్ద్ కా రిష్తా' అనే సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అక్కడి నుంచి జానీ లివర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1992 నుంచి 2000 వరకు ఆయన నటించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య కాలంలో ఆయన ఏకంగా 120 సినిమాల్లో నటించారు. తన కెరీర్ మొత్తంలో ఆయన ఏకంగా 350 సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ ఏకంగా రూ. 250 కోట్లకు పైగానే ఉంది. ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన జానీ లివర్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనిక కమేడియన్లలో ఒకరు. జానీ త్వరలో నటించిన చివరి సినిమా 'లాంత్రని', 'ఐ వాంట్ టు టాక్' అనే సినిమాల్లో కన్పించారు. ఈ ఏడాది 'బడాస్ రవి కుమార్' అనే సినిమాలో కన్పించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

