అన్వేషించండి

Sobhita Dhulipala: సమంత సెలెక్షన్ సూపర్, చైతూ మర్యాదస్తుడు - మాజీ కపుల్‌పై శోభిత కామెంట్స్

తొలిసారి సమంత, నాగ చైతన్య గురించి కామెంట్ చేసింది నటి శోభితా ధూళిపాళ. ఇద్దరిలో తనకు నచ్చే విషయాలను వివరించింది. ‘ది నైట్‌ మేనేజర్‌ 2’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె వీరి గురించి మాట్లాడింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతాతో విడాకుల తర్వాత నటుడు నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఓ సారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్‌ కు మరింత బలం చేకూరినట్టయింది. తాజాగా సమంత, నాగ చైతన్య గురించి తొలిసారి శోభిత ధూళిపాళ్ల బహిరంగంగా స్పందించింది. వీరిద్దరిలో తనకు బాగా నచ్చిన విషయాల గురించి వివరించింది. ‘ది నైట్ మేనేజర్ సీజన్ 2‘ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సమంత సెలెక్షన్ అద్భుతం!

తాజాగా ఇంటర్వ్యూలో సమంత గురించి శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “సమంత సినిమా కెరీర్ చాలా చక్కగా ఉంటుంది. సమంతా చేసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఆమె మూవీ సెలెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ‘ఫ్యామిలీమ్యాన్- 2’ సిరీస్ ఆమె సెలక్షన్స్ లో బెస్ట్. ఆమె సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్ ప్రతి ఒక్కటీ గొప్పగానే ఉంటుంది. ఆమె కెరీర్ బాగా కొనసాగుతోంది” అని చెప్పుకొచ్చారు.  

నాగ చైతన్య హుందాగా, కూల్ గా ఉంటాడు!

ఇక నాగ చైతన్య గురించి కూడా శోభిత కీలక వ్యాఖ్యలు చేసింది. “నాగచైతన్య అందరితో ఇట్టే కలిసి పోతాడు. ఇతరుతో చాలా మర్యాదగా ఉంటాడు. ఎప్పుడూ హుందాగా,  కూల్ గా ఉంటాడు. అన్నింటికి మించి తను చాలా మంచి వాడు” అని వివరించింది. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య గురించి శోభిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

నాగ చైతన్యతో డేటింగ్ రూమర్లపై శోభిత కామెంట్స్!

రీసెంట్ గా నాగ చైతన్యతో డేటింగ్ రూమర్లపై శోభిత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.  ఒకళ్లో, ఇద్దరో ఏదో తెలియకుండా మాట్లాడినంత మాత్రాన, దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిందేం లేదన్నారు. తనకేం సంబంధం లేనప్పుడు, తానేం తప్పు చేయనప్పుడు.. ఇలాంటి రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాల్సి పని కూడా లేదని శోభిత వెల్లడించారు. ఏ తప్పూ చేయనప్పుడు కామ్ గా, ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. దీంతో వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

సమంతతో విడాకులు, శోభితతో డేటింగ్!      

నటుడు నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’లో తనతో పాటు కలిసి నటించిన సమంతతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరు 2017లో పెద్దల సమక్షంలో  వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం హ్యాపీగా సంసార జీవితాన్ని కొనసాగించారు. అనంతరం ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. చివరకు అవి మరింత ముదరడంతో అక్టోబర్ 2021లో విడిపోయారు. విడాకుల తర్వాత, నాగ చైతన్యతో నటి శోభిత డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.  

Also Read ప్రభాస్‌ సినిమాలో కమల్ హాసన్ - కన్ఫర్మ్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్

వరుస సినిమాలతో శోభిత ఫుల్ బిజీ

శోభితా ధూళిపాళ చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. శోభితా ప్రస్తుతం ‘ది నైట్‌ మేనేజర్‌ 2’లో నటించింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘ది నైట్‌ మేనేజర్‌’ సిరీస్‌కు కొనసాగింపుగా ఇది రూపొందింది. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 30 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’, ‘ది మంకీ మ్యాన్’లోనూ నటిస్తోంది.   

Read Also: తమన్నా ముద్దు పెట్టింది, విజయ్ వర్మ థాంక్స్ చెప్పాడు - వెనుక అంత కథ నడిచిందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget