
Sobhita Dhulipala: పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? - అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: అక్కినేని వారసుడు నాగచైతన్య, తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి జరుగుతున్న డిస్కషన్ ఏంటో తెలుసా?

అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ఎక్కడ ఉంటారో తెలుసా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా సరే ఠక్కున సమాధానం చెబుతారు. ఆయన ఉండేది భాగ్య నగరం (హైదరాబాద్)లో. మరి, ఆయనకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ఎక్కడ ఉంటారో తెలుసా? ముంబై మహా నగరంలో! వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. దాంతో ఇద్దరి జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అవి ఏమిటో తెలుసా?
ముంబై టు హైదరాబాద్ చక్కర్లు కొడుతున్న శోభిత
Sobhita Dhulipala frequently visits Hyderabad from Mumbai after her engagement to Naga Chaitanya: శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయి అయినా సరే... ముంబై సిటీలో సెటిల్ అయ్యి చాలా రోజులు అయింది. సినిమా షూటింగ్స్ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటిది ఉంటే తప్ప ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో చోటు చేసుకున్న పెద్ద మార్పు ఏమిటంటే... చైతూతో నిశ్చితార్థం. ఆ తర్వాత ఫ్రీ టైం దొరికితే చాలు... ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వాలిపోతుంది. శోభితాను రిసీవ్ చేసుకోవడం కోసం నాగచైతన్య శంషాబాద్ వెళ్లి వస్తున్నారు.
ఫోటో షూట్స్ చేయడానికి నో చెబుతున్న శోభిత!
శోభితా ధూళిపాళ నటిగా బిజీ. ఎట్ ద సేమ్ టైంలో ఆవిడ సూపర్ సక్సెస్ మోడల్ కూడా. పలు ఫ్యాషన్ మ్యాగజైన్స్. అలాగే ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్స్ కోసం ఫోటో షూట్స్ చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అయితే ఇప్పుడు అటువంటి షూట్స్ చేయడానికి శోభిత 'నో' చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
శోభితాకు అక్కినేని ఫ్యామిలీ కండిషన్లు పెట్టిందా?
నాగచైతన్య, సమంత మధ్య విడాకులకు ప్రధాన కారణం... యాక్టింగ్ కెరీర్ అని అప్పట్లో కొన్ని పుకార్లు వినిపించాయి. సమంత చేసిన కొన్ని క్యారెక్టర్లు, స్పెషల్ సాంగ్స్! అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని, చైతన్య కూడా విషయంలో ఆవిడకు మద్దతు ఇవ్వలేదని అందుకే విడాకులు తీసుకున్నారని గుసగుసలు కనిపించాయి. శోభితాతో నిశ్చితార్థం తర్వాత ఆవిడ చేసిన హాట్ హాట్ ఫోటోషూట్లు సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. ఇప్పుడు శోభితా ధూళిపాళ యాక్టింగ్ కెరీర్ కూడా క్లోజ్ అవుతుందని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ నటించే అవకాశాలు లేవని కొందరు తమకు తోచిన జోస్యం చెప్పారు. ఫిలిం నగర్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం... శోభితా ధూళిపాళకు అక్కినేని ఫ్యామిలీ ఎటువంటి కండిషన్లు పెట్టలేదట. తనకు తానుగా ఫోటో షూట్స్ చేయకూడదని శోభిత డిసైడ్ అయ్యారట.
Also Read: పూజా హెగ్డే దెయ్యంగా మారితే... సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో బుట్టబొమ్మ పాత్ర అదేనా?
పెళ్లి తర్వాత కూడా శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala Wedding) యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తారని తెలిసింది. ఆవిడ నటించిన 'లవ్ సితార' సినిమా ఈ నెల 27వ తేదీన 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నిశ్చితార్థం తర్వాత శోభితా ధూళిపాళ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. మరోవైపు నాగచైతన్య 'తండేల్' సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ ఏడాది రాజస్థాన్ సిటీలోని ఒక కోటలో పెళ్లి చేసుకుంటారని సమాచారం.
Also Read: బెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

