అన్వేషించండి

CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత

Andhra News: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి చట్టబద్ధత తెస్తామని అన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.

CM Chandrababu Review On BC Welfare And Pensions: స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయించారు. సచివాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై సమీక్షలో చర్చించారు. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు సీఎంకు వివరించగా.. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి చట్టబద్ధత కూడా తెస్తామని.. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లు కోల్పోయారని.. ఇవి తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తు చేశారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సమీక్షలో చర్చించారు.

బీసీ హాస్టళ్లలో వసతుల కల్పనపై..

అలాగే, బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాలికల హాస్టళ్లు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 1,100కు పైగా బీసీ విద్యార్థుల హాస్టళ్లు ఉండగా.. ప్రభుత్వ భవనాలు 660, అద్దె భవనాలు 450 ఉన్నాయి. డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా.. రూ.34.14 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఆగస్ట్ నాటికి కాస్మోటిక్ బిల్లులు రూ.20 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. విద్యార్థులకు సామగ్రి, ఇతర వస్తువుల కోసం బడ్జెట్‌లో రూ.18 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే విద్యార్థులకు సామగ్రిని కొనుగోలు చేసి అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని నిర్దేశించారు.

పింఛన్ల తొలగింపుపై..

బీసీ సంక్షేమ శాఖపై సమావేశం నిర్వహించిన అనంతరం సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులున్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోందని చెప్పారు. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టామని.. అర్హులందరికీ పింఛన్లు అందాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనర్హులకు పింఛన్లు ఇవ్వడం సరికాదని, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్ధిష్టమైన నిబంధనలు అమలవ్వాలని పేర్కొన్నారు. అనర్హులను తొలగించేందుకే పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీనే కొందరు తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అటు, ప్రతీ సామాజికవర్గానికీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు పని చేయాలని అధికారులకు సూచించారు.

Also Read: గోగునారతో ఆర్థిక కష్టాలను ఊడ్చేసిన శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం మహిళలు- ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో జాతీయ స్థాయి గుర్తింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ పాస్ అదేనా?
Vijayasai Reddy:  కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
DMK Comments On Pawan Statement: పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Embed widget