Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Instagram Creator Tips: ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే చాలా మందికి ఏ టైమ్‌లో పోస్ట్ ఎక్కువ రీచ్ వస్తుందో తెలీదు. కానీ కొన్ని టైమింగ్స్‌లో పోస్ట్ చేస్తే రెగ్యులర్‌గా వచ్చే దాని కంటే ఎక్కువ రీచ్ వస్తుంది.
Instagram Tips: సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ద్వారా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ రోజుల్లో బాగా పాపులర్ అయిన ఈ సోషల్ మీడియా జాబితాలో ఇన్‌స్టాగ్రామ్ కూడా చేరింది. ప్రజలు తమ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. అలాగే రీల్స్‌ను కూడా అప్‌లోడ్ చేస్తారు. ఫోటోలు లేదా రీల్స్‌ను అప్‌లోడ్ చేయడానికి సరైన సమయం ఏది అని చాలా మంది అయోమయంలో ఉన్నారు.
వాస్తవానికి ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేయడానికి, రీల్స్ అప్‌లోడ్ చేయడానికి సరైన సమయం మీ ఆడియన్స్ జనాభా, టైమ్ జోన్‌ను బట్టి మారవచ్చు. అయినప్పటికీ సాధారణ ట్రెండ్‌లు, డేటా ఆధారంగా మెరుగైన పోస్టింగ్ సమయం కోసం ఇక్కడ కొన్ని సూచనలను అందిస్తున్నాము.
రీల్ లేదా ఫోటోను పోస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం
ఉదయం: చాలా మంది వ్యక్తులు తమ సోషల్ మీడియా ఫీడ్‌లను ఉదయం చెక్ చేస్తున్నందున మనదేశంలో ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోస్ట్ చేయడానికి మంచి సమయం కావచ్చు.
మధ్యాహ్నం: 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య పోస్ట్ చేయడానికి మంచి సమయం కావచ్చు. ప్రత్యేకించి మీరు ఆహార సంబంధిత కంటెంట్ చేస్తున్నా లేదా మీ టార్గెట్ ఆడియన్స్ ఆఫీసుకు వెళ్లే వారు అయినా ఇది దానికి కరెక్ట్ టైమ్. ఎందుకంటే లంచ్ బ్రేక్‌లో సాధారణంగా ప్రజలు తమ ఫోన్‌లను ఉపయోగిస్తూ ఉంటారు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
సాయంత్రం: సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య పోస్ట్ చేయడానికి మంచి సమయం కావచ్చు. ఎందుకంటే ప్రజలు పని తర్వాత లేదా సాయంత్రం విరామ సమయంలో వారి సోషల్ మీడియా ఖాతాలను చక్ చేస్తారు.
వారాంతాల్లో: వీకెండ్స్‌లో పోస్ట్ చేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే వారాంతాల్లో సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడానికి ప్రజలకు ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఉదయం పోస్ట్ చేయడానికి మంచి సమయం కావచ్చు.
అకౌంట్ అనాలసిస్ చేయండి...
ఇది కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌సైట్స్‌ను కూడా చూడండి. దీని కోసం ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఖాతా ఇన్‌సైట్స్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు టోటల్ ఫాలోవర్స్‌పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. మీ ప్రేక్షకులు ఏ సమయంలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారో ఇక్కడ మీరు చూడవచ్చు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
“What was I thinking?” 🤪
— Instagram (@instagram) December 20, 2024
Creator Hudson Stauffer does a fashion look back and predicts his style for 2025 👖 pic.twitter.com/LmfCXsX4Lv
Whether you’re looking for love or just to indulge in the DMs, we’re not here to tell you how to use Close Friends 😂
— Instagram (@instagram) December 18, 2024
Watch @lilyachty and @druski chop it up on a new ep of our Close Friends Only podcast 🎤 (Listen anywhere you get your podcasts.) pic.twitter.com/bNkm0Yd85m