School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోవడం వల్ల వృద్ధులు, చిన్నారులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఏబీపీ దేశం "చలికి వణికిపోతున్న బడి పిల్లలు.. ఎండలోనే పాఠాలు" అనే కథనాన్ని ప్రసారం చేసింది. ఉదయం పూట విద్యార్థులు తొందరగా లేవలేక బడికి ఆలస్యంగా వెళ్లడంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సైతం పాఠశాలల సమయాన్ని ఉదయం 9:15 నుండీ 9:40 కి పొడిగించారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన భీమ్ ఆర్మీ యూత్ సభ్యులు abp కథనానికి స్పందించి బొడ్డిగూడ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్వెటర్లు, నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. దీంతో బొడ్డిగూడ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఏబీపీ దేశం కు కృతజ్ఞతలు తెలిపారు.అదిలాబాద్ జిల్లాకు చెందిన భీమ్ ఆర్మీ యూత్ సభ్యులు స్పందించి బొడ్డిగూడ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్వెటర్లు, నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. దీంతో బొడ్డిగూడ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఏబీపీ దేశం కు కృతజ్ఞతలు తెలుపుతూ.. దుప్పట్లు స్వెటర్లు పంపిణీ చేసిన భీమ్ ఆర్మీ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవలను నిరుపేదలకు అందరూ అందిస్తూ ప్రజాసేవలో ముందుండాలని వారు కోరారు. ఇంకా ఆ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఏమన్నారో ఈ వీడియోలో చూసేయండి.