అన్వేషించండి

Pooja Hegde: పూజా హెగ్డే దెయ్యంగా మారితే... సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో బుట్టబొమ్మ పాత్ర అదేనా?

Pooja Hegde New Movie: పూజా హెగ్డే అంటే బుట్టబొమ్మ. ఆవిడ స్క్రీన్ మీద ఎప్పుడూ అందంగా కనిపించారు. కానీ, ఈసారి రూటు మార్చి దెయ్యంగా కనిపించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ గ్రాఫ్ చూశారా? ఆవిడ ఫిల్మోగ్రఫీని ఎప్పుడైనా గమనించారా? ప్రతి సినిమాలో అందంగా ఉంటారు. డీ గ్లామర్ రోల్స్ చేసిన సందర్భాలు కనిపించవు.‌ అటువంటి పూజా హెగ్డే ఇప్పుడు ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించడానికి ఓకే చెప్పారని తమిళ సినీ వర్గాల సమాచారం. అది ఏమిటో చూద్దామా? 

'కాంచన 4'లో బుట్ట బొమ్మ పూజ హెగ్డే!?
ప్రముఖ నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆయనలో కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు... ఒక హీరో ఉన్నాడు. అలాగే, దర్శకుడు కూడా ఉన్నాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ... దర్శకత్వం వహించిన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'కాంచన' (Kanchana Franchise). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది.‌ 'కాంచన 4' (Kanchana 4 Movie) తీయడానికి రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారు ఇప్పుడు. ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ టాక్.

'కాంచన 4'లో పూజా హెగ్డే దెయ్యం క్యారెక్టర్ చేస్తుందా?
తమిళ సినీ పరిశ్రమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'కాంచన 4'లో పూజా హెగ్డే ఆత్మగా కనిపించనున్నారట.‌ ఆవిడది దెయ్యం క్యారెక్టర్ అని సమాచారం. ఇప్పటి వరకు పూజా హెగ్డే ఫుల్ లెంగ్త్ హారర్ కామెడీ సినిమా ఏది చేయలేదు. రాఘవ లారెన్స్ సరసన కూడా చేయలేదు.‌ అందువల్ల, ఇది ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. 

ఆత్మగా కనిపించే సన్నివేశాలు పక్కన పెడితే... పూజా హెగ్డే ను ఎప్పటిలా అందాల భామగా చూపించే సన్నివేశాలు కూడా ఉన్నాయట. 'కాంచన 4' కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చడంతో దెయ్యంగా కనిపించేందుకు బుట్ట బొమ్మ ఓకే అన్నారట.

Also Read: ఏఆర్ఎమ్ రివ్యూ: టోవినో థామస్ ట్రిపుల్ ధమాకా - అదరగొట్టిన మలయాళ స్టార్... మరి సినిమా? పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఎలా ఉందంటే?


తమిళంలో సూర్యతో... హిందీలో షాహిద్‌తో!
Pooja Hegde Upcoming Movies: ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.‌ ఒకటి షాహిద్ కపూర్ సరసన నటిస్తున్న యాక్షన్ ఫిలిం 'దేవా'. మరొకటి... కోలీవుడ్ స్టార్ హీరోకు జంటగా నటిస్తున్న సినిమా. అది సూర్య 44వ సినిమా. 

పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి రెండేళ్లు దాటింది. కథానాయకగా ఈ అందాల బొమ్మ నటించిన చివరి తెలుగు సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'. ఆ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంటగా సందడి చేశారు. ఆ తర్వాత 'ఎఫ్ 3' సినిమాలో స్పెషల్ సౌంగ్ చేశారు. అప్పటి నుంచి పూజా హెగ్డే తెలుగు సినిమాకు ఓకే చేయలేదు ఇప్పుడు కూడా ఆమె చేతిలో తెలుగు సినిమా లేదు కానీ తమిళ హిందీ భాషల్లో క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తుంది.

Also Readబెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget