అన్వేషించండి

ARM Movie Review - ఏఆర్ఎమ్ రివ్యూ: టోవినో థామస్ ట్రిపుల్ ధమాకా - అదరగొట్టిన మలయాళ స్టార్... సినిమా ఎలా ఉందంటే?

ARM Movie Review In Telugu: 'మిన్నల్ మురళి', '2018' సినిమాలతో మలయాళ హీరో టోవినో థామస్ అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన కొత్త 'ఏఆర్ఎమ్' తెలుగులోనూ విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Tovino Thomas latest movie ARM review in Telugu: కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన '2018'తో తెలుగులోనూ మలయాళ కథానాయకుడు టోవినో థామస్ విజయం అందుకున్నారు. మోహన్ లాల్ 'లూసిఫర్'లో తమ్ముడిగా కనిపించారు. సూపర్ హీరో ఫిల్మ్ 'మిన్నల్ మురళి' భాషలకు అతీతంగా ఆయన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. టోవినో థామస్ నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎమ్' మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ రోజు విడుదలైంది. 

కథ (ARM Movie Story): అజయ్... అజయన్ (టోవినో థామస్) ఓ ఎలక్ట్రీషియన్. చియోతి కావు ఊరిలో అతనికి ఎవరూ గౌరవం ఇవ్వరు. అందుకు కారణం తాతయ్య మణియన్ (టోవినో థామస్). ఆయనొక దొంగ. అందుకని, ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్ ఇంటికి వస్తారు. ఎప్పటికైనా ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అజయ్ తల్లి (రోహిణి) కోరుకుంటుంది. అయితే... ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి రాజవంశస్థుడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) వస్తాడు.  

కేలు (టోవినో థామస్) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఇచ్చిన మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) అజయ్ ఊరిలో ఉంటుంది. ఉత్సవాలు ప్రారంభం కావడానికి పది రోజుల ముందు అమ్మవారి విగ్రహాన్ని ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనం అజయ్ మీదకు తోసివేసే పథకం పన్నుతారు. అప్పుడు అజయ్ ఏం చేశాడు? నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది? మణియన్, కేలు ఏం చేశారు? లక్ష్మి (కృతి శెట్టి)తో అజయ్ ప్రేమకథ ఏమిటి? అజయ్ స్నేహితుడు సురేష్ (బసిల్ జోసెఫ్) ఎటువంటి సాయం చేశాడు? ఊరిలో అసలు దొంగ ఎవరు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ (ARM Review Telugu): 'ఏఆర్ఎమ్'... ఓ యోధుడి కథ. కానీ, కాస్త నిశితంగా గమనిస్తే దర్శక రచయితల నేర్పు కనిపిస్తుంది. కేవలం దీనినొక యాక్షన్ డ్రామాగా లేదంటే టోవినో థామస్ ట్రిపుల్ రోల్స్ చూపించడం కోసమో తీయలేదు. ఇందులో కుల వివక్షను పరోక్షంగా పలు సన్నివేశాల్లో ప్రస్తావించారు. దేవాలయాల్లో తక్కువ కులం ప్రజలకు అప్పట్లో ప్రవేశం లేని విషయాన్నీ, ఊళ్లలో ఓ వర్గం ప్రజలు ఏ విధంగా చిన్న చూపు చూశారనేది అంతర్లీనంగా చూపించారు. ట్రెజర్ హంట్ తరహాలో వచ్చే సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అయితే... మోస్ట్ కమర్షియల్ మూమెంట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఆ విషయంలోనూ లోటు చేయలేదు.

'ఏఆర్ఎమ్' ప్రారంభం సాదాసీదా ఉంటుంది. యోధుడిగా టోవినో థామస్ చేసే యాక్షన్ మెప్పిస్తుంది. ఆ తర్వాత మహారాజు అమ్మవారి విగ్రహం ఇవ్వడం, ఈ కాలానికి వస్తే యంగ్ టోవినో - కృతి శెట్టి మధ్య సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవు. కానీ, బోర్ కొట్టలేదు. మెస్మరైజ్ మూమెంట్స్ లేకున్నా సరదాగా వెళతాయి. అయితే, దర్శక రచయితలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేను బాగా వాడుకున్నారు.

కథలో డల్ మూమెంట్స్ వచ్చిన ప్రతిసారీ మణియన్ పాత్రను తెరపైకి తీసుకు వచ్చారు. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ గూస్ బంప్స్ వచ్చేలా యాక్షన్ సీన్లు రూపొందించారు. మణియన్, అజయన్... ఇద్దరికీ ఒకే విధమైన పరిస్థితులు ఎదురు కావడం, అక్కడ రోహిణిని చూపించిన విధానం బావుంది. అయితే... ఆ తర్వాత వచ్చే పతాక సన్నివేశాల్లో కాస్త బలం తగ్గింది. అదొకటీ ఇంకా బాగా రాసుకుంటే బావుండేది. తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు సైన్ బోర్డ్స్, పేర్లు రాసేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అక్షరాల డిజైన్, అందులో తప్పులు తెలుగు ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌ను దెబ్బ తీస్తాయి. ఎగ్జిక్యూషన్‌ పరంగా మరింత ఎఫెక్టివ్‌గా కొన్నిసార్లు తీసుండొచ్చు. టైమ్ లైన్స్ పరంగా క్లారిటీ లేకుండా తీయడం కొంత మైనస్.

'ఏఆర్ఎమ్' ప్రధాన బలం దిబు నినన్ థామస్ సంగీతం, జోమోన్ టి జాన్ కెమెరా వర్క్. అడివిలో యాక్షన్ సన్నివేశాల సమయంలో వచ్చే ఏరియల్ షాట్స్ చాలా బావున్నాయి. సినిమా అంతా ఆ కలర్ గ్రేడింగ్, లైటింగ్ థీమ్ బావున్నాయి. దిబు నినన్ థామస్ పాటలు, నేపథ్య సంగీతం ఎక్స్ట్రాడినరీ. యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వచ్చాయంటే ఆయన ఆర్ఆర్ మెయిన్ రీజన్.

Also Read: బెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?


టోవినో థామస్ ట్రిపుల్ రోల్ చేశారు. మూడు పాత్రల మధ్య ఆయన చూపించిన వేరియేషన్ బావుంది. కేలుగా సినిమా ప్రారంభంలో చేసే యుద్ధ విన్యాసాలు చాలా బావున్నాయి. ఊరి ప్రజల నుంచి అవమానాలు ఎదుర్కొన్న సమయంలో చక్కటి నటన చూపించారు. కథ, సన్నివేశాలు కుదిరినప్పుడు ధైర్య సాహసాలు ఆ పాత్ర చూపించింది. అయితే... మణియన్ పాత్రలో టోవినో థామస్ నటన 'ఏఆర్ఎమ్' సినిమా అంతటికీ హైలైట్. మణియన్ చూపులో పౌరుషం, కసి ఉంటాయి. ఆ చూపు తెరపై కనిపించిన ప్రతిసారీ వైబ్ వస్తుంది.

లక్ష్మీగా కృతి శెట్టి అందంగా ఉన్నారు. నటిగా పాత్రకు తగ్గట్టు చేశారు. సురభి లక్ష్మి నటన బావుంది. రోహిణి నటనకు పేరు పెట్టలేం. కొందరు ఆమె నటన రొటీన్ అని అనుకోవచ్చు. కానీ, ఆ పాత్రకు ఆమె చేసింది కరెక్ట్. ఓటీటీల్లో బసిల్ జోసెఫ్ ఫిల్మ్స్ చూసిన ప్రేక్షకులను ఈ సినిమాలో సురేష్ క్యారెక్టర్ నవ్విస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర పరిధి పరిమితమే. హరీష్ ఉత్తమన్, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

ఏఆర్ఎమ్ (అజయ్ చేసిన రెండవ దొంగతనం)... ట్రిపుల్ రోల్స్‌లో టోవినో థామస్ యాక్టింగ్ & యాక్షన్ ధమాకా, యాక్షన్ కొరియోగ్రఫీ, దిబు నినన్ థామస్ సంగీతం మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి.

Also Read'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget